• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రవితేజ వారసులు.. తండ్రి...

రవితేజ వారసులు.. తండ్రి కంటే భిన్నంగా..

| గతంలో రాజా ది గ్రేట్ సినిమాలో చిన్నప్పటి రవితేజగా అతను అద్భుతమైన నటన తో మెప్పించాడు.

By - Tupaki Desk
Update: 2024-09-23 11:59 GMT

మాస్ మహారాజ్ రవితేజ వారసులు మోక్షద, మహాధన్ తండ్రి బాటలోనే సినిమా ఇండస్ట్రీలోనే వారి కెరియర్ బిల్డ్ చేసుకునే పనిలో ఉన్నారు. అయితే తండ్రిలా యాక్టర్స్ గా మాత్రం ప్రయత్నం చేయడం లేదని తెలుస్తోంది. రవితేజ కూతురు మోక్షద వయస్సు ఇప్పుడు 21 ఏళ్ళు. ఆమె సొంతంగా బ్యానర్ స్టార్ట్ చేసి నిర్మాతగా అడుగులు వేయాలని అనుకుంటుందంట.

ఇప్పటికే సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ దగ్గర ప్రొడక్షన్ టెక్నీక్స్ గురించి తెలుసుకునే పనిలో మోక్షద ఉందని టాక్ వినిపిస్తోంది. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి ముందుగా కొన్ని చిన్న సినిమాలు నిర్మించాలని ప్లాన్ చేసిందని ప్రచారం నడుస్తోంది. అందులో భాగంగా శ్రీవిష్ణుతో మోక్షద నిర్మాతగా మొదటి సినిమా చేస్తుందని సమాచారం.

నిజానికి రవితేజ ముందుగా తన కూతురు నిర్మాతగా మారడానికి అభ్యంతరం వ్యక్తం చేసిన ఫైనల్ గా ఒకే చెప్పారని టాక్. మరో వైపు రవితేజ తనయుడు మహాధన్ ప్రస్తుతం 18 ఏళ్ళ వయస్సులో ఉన్నాడు. తండ్రి బాటలో హీరో అవుతాడని అందరూ భావించారు. గతంలో రాజా ది గ్రేట్ సినిమాలో చిన్నప్పటి రవితేజగా అతను అద్భుతమైన నటన తో మెప్పించాడు. అయితే మహాధన్ కి ఇప్పుడు ఫోకస్ డైరెక్షన్ మీద ఇంటరెస్ట్ ఉందని టాక్.

ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా మేకింగ్ స్టైల్ అంటే మహాధన్ కి ఇష్టం అంట. అందుకే స్ట్రాంగ్ రిఫరెన్స్ తో సందీప్ రెడ్డి వంగా దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాడనే మాట వినిపిస్తోంది. రెండు, మూడు సినిమాలకి వర్క్ చేసిన తర్వాత దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వాలని మహాధన్ ప్లాన్ చేసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే కొందరు వారసులు మేకింగ్ మీదుగా అవగాహన తెచ్చుకున్న తరువాత నటులుగా మారుతున్నారు. బహుశా రవితేజ కొడుకు కూడా అలానే చేస్తున్నాడేమో.

మొత్తానికి రవితేజ కొడుకు, కూతురు సినిమా ఇండస్ట్రీలోనే కెరియర్ బిల్డ్ చేసుకుంటున్నారు. ఇక రవితేజ కెరియర్ ఆరంభంలో అసిస్టెంట్ డైరెక్టర్స్ గా కొన్ని సినిమాలకి వర్క్ చేశాడు. తరువాత నటుడిగా మారి ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రస్తుతం స్టార్ హీరో రేంజ్ కి వచ్చాడు. ఇక రవితేజ కొడుకుని అతని ఫ్యాన్స్ హీరోగా చూడాలని అనుకుంటున్నారు.

మరి ఫ్యాన్స్ కోరిక మేరకు అతను హీరోగా మారుతాడా లేదంటే దర్శకుడిగానే కెరియర్ కొనసాగిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం భాను భోగవరపు దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. రవితేజకి గాయం కావడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అలాగే మరో ప్రాజెక్టుపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు.

Tags:    
  • Raviteja 
  • Tollywood 
  • Son 
  • Debut 
  • Mahadhan 
  • Mokshadhabhupatiraju 
  • Sitara 
  • RT75 
  • Mrbachchan 

Similar News

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

Copyright @2026

Powered by Blink CMS