న‌టుడిగా మ‌రో స్థాయికి వెళ్లాల‌ని కోరుకుంటున్నా: ర‌వితేజ‌

రవితేజ గారిలా వినోదాన్ని పంచేవాళ్ళు అరుదుగా ఉంటారు. రజినీకాంత్ గారు, అమితాబ్ బచ్చన్ గారు ఎలాగైతే వినోదాన్ని పంచగలరో రవితేజ గారు కూడా అలాగే అలరిస్తారు.;

Update: 2025-10-28 17:25 GMT

మాస్ మహారాజా రవితేజ న‌టించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం `మాస్ జాతర`. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అక్టోబర్ 31 సాయంత్రం ప్రత్యేక ప్రదర్శనలతో థియేటర్లలో అడుగుపెట్టనున్న `మాస్ జాతర`పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను, అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని జె.ఆర్.సి కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ వేడుకను చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. అభిమానుల కోలాహలం నడుమ వైభవంగా జరిగిన ఈ వేడుకకు తమిళ అగ్ర కథానాయకుడు సూర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఎన‌ర్జీ మ‌నిషి రూపంలో ఉంటే...

ముఖ్య అతిథి సూర్య మాట్లాడుతూ.. ``రవితేజ గారితో 20 ఏళ్ళ అనుబంధం ఉంది. ఈ రోజు ఒక ఫ్యాన్ బాయ్ లా మాట్లాడుతున్నాను. ఆయన పేరు వింటేనే ఆనందం కలుగుతుంది. ఎనర్జీ మనిషి రూపంలో ఉంటే అది రవితేజ గారు. చాలా ఏళ్లుగా రవితేజ గారిపై అభిమానులు ఎంతో ప్రేమని కురిపిస్తున్నారు. తెరపై ఒక కామన్ మ్యాన్ ని కింగ్ సైజ్ లో సహజంగా చూపించాలంటే అది రవితేజ గారికే సాధ్యమవుతుంది. తన సహజ నటనతో పాత్రకు ప్రాణం పోస్తారు. ఆయన నటనకు నేను అభిమానిని. నవ్వించడం అనేది చాలా కష్టం. కానీ, రవితేజ గారు మాత్రం తనదైన శైలిలో చాలా తేలికగా ఎన్నో ఏళ్ళుగా వినోదాన్ని పంచుతున్నారు. తెలుగు ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకునేలా ఆయన చేస్తారు. ఇడియట్, కిక్ సహా రవితేజ గారు నటించిన పలు సినిమాలు తమిళ్ లోనూ మంచి ఆదరణ పొందాయి. విక్రమార్కుడు రీమేక్ నా సోదరుడు కార్తీ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ గా నిలిచింది.

రవితేజ గారిలా వినోదాన్ని పంచేవాళ్ళు అరుదుగా ఉంటారు. రజినీకాంత్ గారు, అమితాబ్ బచ్చన్ గారు ఎలాగైతే వినోదాన్ని పంచగలరో రవితేజ గారు కూడా అలాగే అలరిస్తారు. రవితేజ గారు ఇలాగే వినోదాన్ని పంచుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రవితేజ గారిపై దర్శకుడు భానుకి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలై, సపోర్టింగ్ యాక్టర్ గా, ఇప్పుడు మాస్ మహారాజాగా ఎదిగిన రవితేజ గారు ఎందరికో స్ఫూర్తి. నాగవంశీ గారు వరుస సినిమాలు చేస్తున్నారు. మంచి సినిమాలు చేస్తున్నారు. ఆయన బ్యానర్ లో నేను ఒక సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. భీమ్స్ అద్భుతమైన సంగీతం అందించారు. భవిష్యత్తులో ఆయనతో కలిసి పని చేస్తానని ఆశిస్తున్నాను`` అన్నారు.

మ‌రో అద్భుత ద‌ర్శ‌కుడు వ‌స్తున్నాడు:

మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ..``మా సంగీత దర్శకుడు భీమ్స్ ఇంకో చార్ట్ బస్టర్ ఇచ్చాడు. ఈ సాంగ్స్ మీరు థియేటర్ లో విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఇచ్చాడు. నాకిష్టమైన వ్యక్తుల్లో ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర గారు ఒకరు. ఆయన వేసిన సెట్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ చిత్రంలో యాక్షన్ బాగుందంటే ఆ క్రెడిట్ మా ఫైట్ మాస్టర్స్ వెంకట్, పృథ్వీకి వెళ్తుంది. మా డీఓపీ విధు వర్క్ మీ అందరికీ నచ్చుతుంది. శివుడు పాత్ర చేసిన నవీన్ గురించి మాట్లాడాలి. నవీన్ ఇలా కూడా చేయగలడా అని ఆశ్చర్యపోయేలా చేశాడు. నటుడిగా ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. సినిమా విడుదలయ్యాక శివుడు పాత్ర గురించి మాట్లాడుకుంటారు.

రాజా ది గ్రేట్ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి నటించాను. రాజేంద్ర ప్రసాద్ గారి పాత్ర అద్భుతంగా ఉంటుంది. మా కాంబినేషన్ ని ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ కోరుకుంటారని అనుకుంటున్నాను. నాది, శ్రీలీలది సూపర్ హిట్ జోడి. ఈ సినిమాలో కొత్త శ్రీలీలను చూడబోతున్నారు. ఫుల్ మాస్ పాత్ర చేసింది. ఈరోజు గెస్ట్ గా విచ్చేసిన సూర్య గారికి థాంక్యూ సో మచ్. మాస్ జాతర చిత్రం ఖచ్చితంగా బాగుంటుందని నమ్ముతున్నాను. సక్సెస్ మీట్ లో నిర్మాత నాగవంశీ గురించి ప్రత్యేకంగా మాట్లాడతాను. భాను రూపంలో మన పరిశ్రమకి మరో మంచి దర్శకుడు వస్తున్నాడు. ఈ సినిమాతో దర్శకుడు భానుకి అభిమానులు ఏర్పడతారు. మాస్ మాత్రమే కాదు, అన్ని రకాల సినిమాలు చేయగలడు. రచయిత నందుకి మంచి భవిష్యత్తు ఉంది. మాస్ జాతర చిత్రం మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా అభిమానులను అసలు నిరాశపర్చదు. ఇది నా హామీ`` అన్నారు.

Tags:    

Similar News