మాస్ జాతర తర్వాత రాజా ప్లాన్ ఏంటి..?
మరోసారి ఈ ఇద్దరు కలిసి హంగామా చేయనున్నారు. మాస్ జాతర సినిమా కంటెంట్ విషయంలో కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుందని టాక్;
మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం మాస్ జాతర సినిమాతో రాబోతున్నాడు. భాను భోగవరపు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా తో ఎలాగైనా మాస్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు రవితేజ. ఈ సినిమాలో శ్రీలీల నటించడం విశేషం. ఆల్రెడీ రవితేజ, శ్రీలీల ధమాకా సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. మరోసారి ఈ ఇద్దరు కలిసి హంగామా చేయనున్నారు. మాస్ జాతర సినిమా కంటెంట్ విషయంలో కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుందని టాక్.
ఈమధ్య రవితేజ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు ఇవ్వట్లేదు. అందుకే మాస్ జాతర సినిమా కోసం ఎక్కువ జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తుంది. కచ్చితంగా మాస్ జాతర మాస్ రాజా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మాస్ రాజా కిశోర్ తిరుమల డైరెక్షన్ లో సినిమా లాక్ చేసుకున్నాడని టాక్. సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కిశోర్ తిరుమల రవితేజకు కథ చెప్పి ఒప్పించడం తో ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైట్ అవుతున్నారు.
ఐతే ఈ సినిమాకు అనార్కలి అనే టైటిల్ ప్లానింగ్ లో ఉందట. మాస్ రాజా అనార్కలి టైటిల్ అంటే మస్త్ జబర్దస్త్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈ సినిమాలో ప్రేమలు బ్యూటీ మమితా బైజు, డ్రాగన్ లో యూత్ ఆడియన్స్ ని మెప్పించిన కయదు లోహర్ ఇద్దరు హీరోయిన్స్ గా నటిస్తున్నారని తెలుస్తుంది. తన సినిమాల్లో మంచి లవ్ స్టోరీ ఉండేలా చూసుకునే కిశోర్ తిరుమల అనార్కలి అంటూ రవితేజతో ఎలాంటి సినిమా చేస్తాడన్నది మాస్ రాజా ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తుంది.
రవితేజ కూడా మాస్ జాతర రిలీజ్ కాగానే నెక్స్ట్ అనార్కలి మీద ఫోకస్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. రవితేజకి మళ్లీ ఒక మాస్ హిట్ పడితే చూడాలని మాస్ మహారాజ్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. మాస్ మహారాజ్ తిరిగి ఫాం లోకి వస్తే మాత్రం ఆ లెక్క వేరేలా ఉంటుందని చెప్పొచ్చు. రవితేజ అనార్కలి సినిమాను దిల్ రాజు నిర్మిస్తారని తెలుస్తుంది. దిల్ రాజు రవితేజ కాంబో ఆల్రెడీ మంచి సినిమాలు వచ్చాయి. సో ఈ విధంగా కూడా అనార్కలి పై సూపర్ బజ్ ఏర్పడుతుంది. మరి కిశోర్ తిరుమల రవితేజ ఎనర్జీని ఎంతమేరకు వాడుకుంటాడు.. ఈ కాంబో మాస్ ఫ్యాన్స్ కి ఎలాంటి కిక్ ఇస్తుంది అన్నది చూడాలి.