రవితేజ - వివేక్ ఆత్రేయ సినిమాలో ఆ నటుడు దెయ్యం గా కనిపించ బోతున్నాడా?

మాస్ మహారాజా రవితేజ ఒకప్పుడు సంవత్సరానికి మూడు నాలుగు సినిమాలు చేసేవారు.

Update: 2026-10-12 10:30 GMT

మాస్ మహారాజా రవితేజ ఒకప్పుడు సంవత్సరానికి మూడు నాలుగు సినిమాలు చేసేవారు. గత కొంతకాలంగా ఆయనకి సరైన సక్సెస్ లు దక్కడం లేదు. ఎట్టకేలకు శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కిన 'ఇరుముడి' సినిమాతో భారీ కలెక్షన్స్ కొల్లగొట్టి గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'తులాభారం' అనే సినిమా చేస్తున్నాడు. రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో వచ్చేసింది. ఈ సినిమాలో రవితేజ తో పాటు ప్రియాంక అరుల్ మోహన్, అనస్వర రాజన్, తరుణ్ భాస్కర్, జేడీ చక్రవర్తి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వివేక్ ఆత్రేయ గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగనుందట...

కొత్తగా ఆలోచిస్తున్న రవితేజ

ఒకప్పుడు రవితేజ కమర్షియల్ సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవాడు. నా ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో, నేనింతే లాంటి భిన్నమైన మూవీస్ తో ట్రై చేసిన బాక్సాఫీస్ వద్ద అనుకున్న సక్సెస్ ను సాధించలేదు. దాంతో మళ్ళీ రొటీన్ కమర్షియల్ మూసలోనే మూవీస్ చేస్తున్నారు. ఒక దశలో రవితేజ నుంచి వచ్చే సినిమాలను చూడటానికి ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. 'ఇరుముడి' సినిమాతో మరోసారి రవితేజ లైమ్ లైట్ లోకి రావడం అతని అభిమానుల్లో జోష్ నింపింది. ఇప్పుడు వివేక్ ఆత్రేయ లాంటి వైవిధ్యభరితమైన సినిమాలను తీసే దర్శకుడితో జతకట్టడంతో రవితేజ లోని విలక్షణ నటుడు బయటికి వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇరుముడి ఎప్పుడైతే విజయం సాధించిందో ఆయన ఆలోచన పూర్తిగా మారిపోయిందట. కథల్లో కొత్తదనం ఉంటేనే మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.

దెయ్యం గా కనిపించే నటుడు

ఈ సినిమాలో రవితేజ తో పాటు పోటాపోటీగా నటించడానికి జేడీ చక్రవర్తి రెడీ అవుతున్నాడు. చక్రవర్తి ఇందులో దెయ్యం గా కనిపించబోతున్నాడని ఫిలిం నగర్ సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఆత్మలు, దెయ్యాలు, భూతాలు అంటూ హర్రర్ గొలిపే సన్నివేశాలతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయట. వివేక్ ఆత్రేయ అంటే స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంటాడు. కాబట్టి ఈ సినిమాలో డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో ముందుకు సాగాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రవితేజను డిఫరెంట్ గా చూపించి, దమ్మున్న మేకర్ గా వివేక్ ఆత్రేయ ప్రేక్షకుల నుంచి ప్రశంసలను అందుకోవాలనే ప్రయత్నం లో ఉన్నాడట...

Tags:    

Similar News