మూడేళ్లు ఆలస్యమైనా? మొత్తం లెక్క సరిచేసే ప్లాన్ తో మెగా అల్లుడు!
మెగా ఫ్యామిలీ హీరోలకు ఉండే క్రేజ్ ప్రత్యేకంగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మెగా ఫ్యామిలీ హీరోలకు ఉండే క్రేజ్ ప్రత్యేకంగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కోవకే చెందిన వైష్ణవ్ తేజ్ `ఉప్పెన` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఘనమైన అరంగేట్రం చేసి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించారు. తొలి సినిమాతోనే 100 కోట్ల క్లబ్‌లో చేరిన యంగ్ హీరో అటుపై ఆశించిన స్థాయిలో విజయాలను అందుకో లేకపోయారు. వరుస అపజయాల కారణంగా మూడు సంవత్సరాలుగా వైష్ణవ్ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఈ విరామం గ్యాప్ మాత్రమే కాదు. తనలోని నటుడిని మరింత మెరుగు పరుచు కోవడానికి , బలమైన కథలను ఎంచుకోవడానికి ఆయన చేస్తున్న కసరత్తు అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
తాజాగా వైష్ణవ్ తేజ్ సరికొత్త జోరుతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటేందుకు సిద్దమవుతున్నారు. ఒకరిద్దరు దర్శకులతో కాకుండా ఏకంగా మూడు ప్రాజెక్ట్‌లతో స్ట్రాంగ్ రీఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ కంబ్యాక్ ప్లాన్‌లో భాగంగా వైష్ణవ్ తేజ్ తొలి ప్రాజెక్ట్ అధికారికంగా పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. నూతన దర్శకుడు మహేష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ఎకె ఎంట ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత అనిల్ సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
మహేష్‌తో పాటు మరికొద్ది మంది ప్రతిభావంతులైన దర్శకులతో కూడా మెగా హీరో చర్చలు జరుపుతున్నారు. టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథాంశాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వి.ఐ. ఆనంద్‌తో వైష్ణవ్ తేజ్ ఒక ప్రాజెక్ట్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కాంబినేషన్ ప్రేక్షకులకు ఓ కొత్త జానర్ సినిమాను అందించనుందని తెలుస్తోంది. వీటితో పాటు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో కూడా వైష్ణవ్ తేజ్ నటించనున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌కు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు జీ నిర్మించే అవకాశం ఉంది. ఈ భారీ కాంబినేషన్‌పై టాలీవుడ్ సర్కిల్స్‌లో ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ఈ మూడు ప్రాజెక్ట్‌లకు సంబంధించిన అధికారిక ప్రకటనలు త్వరలోనే వెలువడనున్నాయి. గత మూడు సంవత్సరాల నిరీక్షణకు గురైన వరుణ్ తేజ్ ఒకేసారి ఆ లెక్క సరిచేయడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. అంటే ఏడాదికో సినిమా చొప్పన రిలీజ్ చేయాల్సిన ప్రాజెక్ట్ లను ఒకేసారి పూర్తి చేసి వాటిని బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అదే నిజమైతే గ్యాప్ తీసుకున్న లెక్క సరి పోతుంది. అయితే కథ విషయంలో వైష్ణవ్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడు? అన్నది రిలీజ్ వరకూ గానీ చెప్పలేం.