సరస్వతీ 'పుత్ర' డెబ్యూ.. ప్రూవ్ చేసుకుంటే తిరుగులేనట్లే!
లిరిక్స్ అందించడంలో తండ్రి ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్నారు.. ఇప్పుడు సంగీతంతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని సిద్ధ మవుతున్నాడు కొడుకు.
లిరిక్స్ అందించడంలో తండ్రి ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్నారు.. ఇప్పుడు సంగీతంతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని సిద్ధమవుతున్నాడు కొడుకు. ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి చిన్న కొడుకు సాయి హర్ష మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న కొత్త సినిమాతో తన జర్నీని మొదలుపెట్టబోతున్నారు.
రామజోగయ్య శాస్త్రికి తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఎన్నో సినిమాలకు ఆయన రాసిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాంటి రైటర్ కొడుకు ఇప్పుడు సంగీత దర్శకుడిగా పరిచయం అవుతుండటంతో ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే, తండ్రి పే క్రాఫ్ట్ వేరు.. కొడుకు సెలెక్ట్ చేసుకున్న క్రాఫ్ట్ వేరు. అందుకే సాయి హర్ష మ్యూజిక్ తోనే తన సత్తా చాటుకోవాల్సి ఉంటుంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న కొత్త రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీతో ఆయన అరంగేట్రం చేస్తున్నారు. 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ వనం ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమార్తె మేధా మేక హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. జై జాస్తి ఇందులో మరో కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఆ సినిమా సాయి హర్షకు ఫస్ట్ ఛాన్స్ మాత్రమే కాదు.. తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకునే ప్లాట్ ఫామ్ అని చెప్పాలి. ఎందుకంటే బడా నిర్మాణ సంస్థలో అవకాశం రావడం కెరీర్ కు మంచి స్టార్టింగే. కానీ, సంగీత దర్శకుడిగా రాణించాలంటే ప్రేక్షకులకు నచ్చే పాటలు ఇవ్వాలి. ముఖ్యంగా ప్రేమకథా చిత్రాల్లో సాంగ్స్ కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. స్టోరీలోని ఫీలింగ్స్ ను సాంగ్స్ రూపంలో చెప్పగలిగితేనే అవి ఆడియన్స్ కు గుర్తుండిపోతాయి.
మంచి ట్యూన్లు, వినసొంపైన సంగీతం, సందర్భానికి తగ్గ పాటలు ఇస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం కొత్త సంగీత దర్శకులకు అవకాశాలు వస్తున్నా.. ప్రేక్షకుల రెస్పాన్స్ పొందడం అంత ఈజీ కాదు. ఒక్క పాట నచ్చితే చాలు.. అది సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. అదే సమయంలో సాంగ్స్ ఆకట్టుకోకపోతే అనుకున్న రేంజ్ లో గుర్తింపు రాకపోవచ్చు. అందుకే సాయి హర్ష తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది.
అలా రామజోగయ్య శాస్త్రి తన పెన్ తో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు ఆయన కుమారుడు తన స్వరాలతో అదే స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నారు. అయితే, తండ్రి సాధించిన విజయాలతో కంపేర్ చేయడం కంటే తనకంటూ స్పెషల్ స్టైల్ సొంతం చేసుకోవడం మెయిన్. తొలి సినిమాతోనే మంచి పాటలు అందించి ప్రేక్షకుల ప్రశంసలు పొందితే, ఆ తర్వాత వరుస ఛాన్సులు రావచ్చు. అప్పుడు కూడా మెప్పిస్తే తిరుగుండదు. అందుకే సరస్వతీ 'పుత్రుడు' తమ అవుట్ పుట్ తో ఎంతలా ఆకట్టుకుంటారో అంతా వేచి చూడాలి.