కామ్రేడ్ కళ్యాణ్.. 3 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?
యంగ్ హీరో శ్రీవిష్ణు సినిమా అంటే కామెడీకి లోటు ఉండదనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది.
యంగ్ హీరో శ్రీవిష్ణు సినిమా అంటే కామెడీకి లోటు ఉండదనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. ఇప్పుడు కామ్రేడ్ కళ్యాణ్ కూడా అదే తరహాలో ప్రేక్షకులను నవ్విస్తూ థియేటర్లలో సందడి చేస్తోంది. దసరా సెలవులు కలిసి రావడంతో ఆ సినిమాకు కుటుంబ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఆ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.19.8 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు మూవీ టీమ్ వెల్లడించింది.
శ్రీవిష్ణు లీడ్ రోల్ లో జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా అక్టోబర్ 9న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. కోన వెంకట్ సమర్పణలో రూపొందిన ఆ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్ గా నటించారు. సత్య, సుదర్శన్, వెన్నెల కిషోర్, రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందించారు.
శ్రీవిష్ణు సినిమాల్లో స్టోరీతో పాటు కామెడీకి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు కామ్రేడ్ కళ్యాణ్ లో అదే తరహా ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నం చేశారు. నవ్వులు పంచే సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని మూవీ టీమ్ చెబుతోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలిపింది. విడుదలైన తొలి మూడు రోజుల్లో వచ్చిన వసూళ్లు మూవీ టీమ్ లో జోష్ పెంచాయి.
ఇక సినిమా కథ 1992 బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని మాడుగులలో తాడికొండ కళ్యాణ్ జీవితం చుట్టూ కథ తిరుగుతుంది. నటుడు ఆర్. నారాయణమూర్తికి అభిమాని అయిన కళ్యాణ్.. ఆయన సినిమాలను తన ఊరిలోని పాత థియేటర్ లో ప్రదర్శిస్తుంటాడు. తల్లిపై ఎంతో ప్రేమ చూపించే అతని జీవితంలోకి సితార రావడంతో కొత్త మలుపులు మొదలవుతాయి. ఆమె కుటుంబానికి ఎదురైన సమస్యలను పరిష్కరించే క్రమంలో కళ్యాణ్ అనుకోని పరిస్థితుల్లో చిక్కుకుంటాడు.
ఈ నేపథ్యంలో రాజకీయాలు, విప్లవ ఉద్యమాల బ్యాక్ డ్రాప్ కు ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసి కథను ముందుకు తీసుకెళ్లారు. ఇక వసూళ్ల విషయానికి వస్తే.. తొలి వీకెండ్ లో మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.19.8 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు మేకర్స్ రీసెంట్ గా అనౌన్స్ చేశారు. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయిందని, ఇకపై వచ్చే వసూళ్లు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉందని మూవీ టీమ్ పేర్కొంది.
దసరా సెలవులు ఆ సినిమాకు మరో అవకాశంగా మారనున్నాయి. సెలవుల సమయంలో కుటుంబాలతో కలిసి సినిమాలు చూసేందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ నేపథ్యంలో కామ్రేడ్ కళ్యాణ్ కు వచ్చే రోజుల్లో ఎలాంటి వసూళ్లు వస్తాయనేది చూడాలి. అదే సమయంలో ప్రేక్షకుల రెస్పాన్స్ మరింత పెంచుకునేందుకు మూవీ టీమ్ పోస్ట్ ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టేందుకు సిద్ధమవుతోంది.