మెలోడీతో అదరగొట్టిన భీమ్స్
హిట్టూ ఫ్లాపుతో సంబంధం లేకుండా మాస్ మహారాజా రవితేజ వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు.;
హిట్టూ ఫ్లాపుతో సంబంధం లేకుండా మాస్ మహారాజా రవితేజ వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన 75వ సినిమా మాస్ జాతర అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు సూపర్‌హిట్ సినిమాలకు రైటర్ గా వర్క్ చేసిన భాను భోగవరపు ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతుండగా, మాస్ జాతరలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు.
మరోసారి ధమాకా కాంబినేషన్
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ నుంచే మంచి అంచనాలున్నాయి. ధమాకా తర్వాత రవితేజ, శ్రీలీల, భీమ్స్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో మాస్ జాతర కూడా ధమాకా లానే సూపర్ హిట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. అందరి అంచనాలకు తగ్గట్టే ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజైన టీజర్లు, సాంగ్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్
కాగా ఇప్పుడు మాస్ జాతర నుంచి హుడియో హుడియో అంటూ సాగే మూడో పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. సాంగ్ వినడానికి క్యాచీగా వినసొంపుగా ఉంటూ, అందరినీ కట్టిపడేసేలా ఉంది. పాటలో రవితేజ వింటేజ్ లుక్ మరియు మంచి ఎనర్జీతో చాలా ఎట్రాక్టివ్ గా కనిపిస్తున్నారు. రవితేజ, శ్రీలీల మధ్య కెమిస్ట్రీ, దానికి సరిగ్గా సరిపోయేలా భీమ్స్ ట్యూన్, హేషమ్ అబ్దుల్ తో పాటూ భీమ్స్ గానం పాటను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాయి.
ట్రైలర్ పైనే అందరి దృష్టి
ఇప్పటికే రిలీజైన రెండు సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రాగా, ఇప్పుడు రిలీజైన హుడియో హుడియో సాంగ్ కూడా సాఫ్ట్ మెలోడీగా ఆకట్టుకుంటుంది. హీరో తన ప్రేమను, హీరోయిన్ పై ఉన్న ఫీలింగ్స్ ను తెలిపేలా ఈ సాంగ్ ను రూపొందించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమా ట్రైలర్ పైనే ఉంది. ట్రైలర్ రిలీజయ్యాక మాస్ జాతరకు ఉన్న క్రేజ్ మరింత పెరిగే అవకాశముంది.