• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ పాప రష్మిక కూతురు...

ఆ పాప రష్మిక కూతురు కాదురా బాబు !

| టాలీవుడ్‌ లో ఈమె ప్రస్తుతం పుష్ప 2 తో పాటు రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తుంది.

By - Tupaki Desk
Update: 2024-08-08 00:30 GMT

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం బాలీవుడ్‌, టాలీవుడ్‌ సినిమాలతో బిజీ బిజీగా ఉంది. మధ్య మధ్య లో కోలీవుడ్‌ మరియు శాండిల్‌వుడ్‌ లో కూడా సినిమాలు చేస్తూ ఉంది. బాలీవుడ్‌ లో ఈమె మొదట చేసిన రెండు సినిమాలు నిరాశ పరచడంతో అక్కడ ఈమె కెరీర్‌ సాగడం కష్టమే అనుకున్నారు. కానీ అనూహ్యంగా యానిమల్‌ సినిమా కారణంగా బాలీవుడ్‌ లో బిజీ అయ్యింది. బ్యాక్ టు బ్యాక్ అక్కడ నుంచి ఆఫర్లు వస్తున్నాయని, ఇప్పటికే రెండు మూడు పెద్ద హిందీ సినిమాలకు కూడా ఈమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి.


టాలీవుడ్‌ లో ఈమె ప్రస్తుతం పుష్ప 2 తో పాటు రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తుంది. మరో వైపు హీరోయిన్‌ గా కోలీవుడ్‌ లో ఒక స్టార్‌ హీరో సినిమాలో నటిస్తుంది. రష్మిక మందన్న సినిమా ఇండస్ట్రీలో ఇంత బిజీగా ఉండటం వల్ల కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేక పోతుందట. ఆ మధ్య ఒక చిన్నారితో ఉన్న ఫోటోను రష్మిక షేర్ చేసి సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఏడు ఏళ్లు అవుతుంది... నీతో సమయం ఎక్కువ గడపడం వీలు పడటం లేదు. ఈ ఏడు సంవత్సరాల్లో నీతో కేవలం నాలుగు నెలలు మాత్రమే ఉన్నాను అంటూ రష్మిక ఆవేదన చెందింది.

ఆ ఫోటోను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. రష్మిక కూతురు అంటూ ఆ పాపను గురించి కథనాలు రాయడం జరిగింది. కానీ అసలు విషయం ఏంటంటే ఆ పాప రష్మిక కి సోదరి. రష్మిక పుట్టిన 16 ఏళ్ల తర్వాత ఆ పాప జన్మించింది. ఇద్దరి మధ్య ఎక్కువ వయసు తేడా ఉండటం వల్ల అక్క చెల్లిలా కాకుండా తన చెల్లిని అమ్మలా చూసుకుంటాను అంటూ రష్మిక ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అందులోంచి కావాల్సిన వ్యాఖ్యలు కట్‌ చేసి మరి కొందరు రష్మిక కూతురు అంటూ ప్రచారం చేయడం మొదలు పెట్టారు.

ఎవరు ఏం విమర్శలు చేసినా, మీమ్స్ చేసినా కూడా రష్మిక మందన్న పట్టించుకోకుండా తన పని ఏదో తాను చేసుకుంటూ వెళ్ళింది. అలా మొండిగా కెరీర్‌ లో వెళ్తుంది కనుక ఈ స్థాయి లో ఉంది అంటూ ఆమె సన్నిహితులు అంటున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రష్మిక తన చెల్లి గురించి మరోసారి స్పందిస్తూ.. మా ఇద్దరి మధ్య ఎక్కువ వయసు తేడా ఉండటం వల్ల గొడవలు అసలు రావు. నేను తనను ఒక చెల్లిలా కాకుండా నా కూతురులా చూసుకుంటాను. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఏడు ఏళ్లలో తనతో కేవలం నాలుగు నెలలు మాత్రమే గడిపాను. అయితే ప్రతి రోజు వీడియో కాల్‌ ద్వారా మాట్లాడుకుంటామని చెప్పింది.

ఇక రష్మిక మందన్న సినిమాల విషయానికి వస్తే టాలీవుడ్‌ లో పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్‌ కి జోడీగా నటిస్తుంది. మరో వైపు రెయిన్‌ బో మరియు ది గర్ల్‌ ఫ్రెండ్‌ అనే రెండు విభిన్న లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇక తమిళంలో ఈ అమ్మడు కుబేర సినిమాలో నటిస్తుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న కుబేర సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తుండగా, నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు. బాలీవుడ్‌ లో సికిందర్ తో పాటు చావా అనే సినిమాల్లో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాదిలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. రష్మిక రాబోయే రెండేళ్లు ఫుల్ బిజీగా ఉండబోతుంది. ఆమె నటించిన సినిమాలు రెండు మూడు నెలలకు ఒకటి చొప్పున విడుదల అవుతూనే ఉంటాయి.

Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Pushpa2 
  • Alluarjun 
  • Rashmikamandanna 
  • Ladyorientedfilms 
  • Rainbow 
  • TheGirlfriend 
  • Shiman 
  • Interview 
  • Rashmikasister 
  • Socialmedia 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS