స్పీడ్ పెంచుతున్న రష్మిక.. అసలు వర్క్ షురూ

అల్లు అర్జున్, రష్మిక మందనా జంటగా నటించిన పుష్స సినిమా బాక్సాఫీసును ఎలా షేక్ చేసిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.;

Update: 2023-08-20 07:31 GMT

అల్లు అర్జున్, రష్మిక మందనా జంటగా నటించిన పుష్స సినిమా బాక్సాఫీసును ఎలా షేక్ చేసిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సినిమా లో అల్లు అర్జున్ స్వాగ్ కి అందరూ ఫిదా అయిపోయారు. ఈ సినిమా విడుదలై చాలా కాలం అవుతున్నా, ఇప్పుడు ఈ మూవీలోని డైలాగ్స్ అందరూ చెబుతూనే ఉన్నారు. టీమిండియా క్రికెటర్లు సైతం ఈ మూవీలో డైలాగులు, యాక్షన్స్ చేశారంటే, ఈ సినిమా ఎంత ఇంపాక్ట్ చూపించిందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ మూవీలో రష్మిక డీ గ్లామర్ లుక్ లో ఆకట్టుకుంది. శ్రీవల్లి పాత్రకు బాగా నప్పింది. అయితే, రెండో భాగం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, మొన్నటి వరకు ఈ మూవీ షూటింగ్ లో రష్మిక పాల్గొనకపోవడంతో, చాలా రూమర్లు వచ్చాయి. పుష్ప2లో రష్మిక పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుంది, మరో హీరోయిన్ కూడా ఉంటుందని, ఇలా చాలా రకాల వార్తలు వచ్చాయి. అయితే, వాటిలో నిజం ఏమీ లేదు అని తెలుస్తోంది.

రష్మిక తాజాగా, ఈ మూవీ షూటింగ్ లో పాల్గొనడం గమనార్హం. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ మూవీ షూటింగ్ మొదలైంది. రష్మిక, అల్లు అర్జున్ మధ్య సీన్లు తెరకెక్కిస్తున్నారట. వీరి మధ్య మొదటి భాగంలో కంటే ఎక్కువగా రొమాంటిక్ సీన్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రష్మిక పార్ట్ అయిపోతే, దాదాపు మూవీ షూటింగ్ పూర్తి అయ్యే అవకాశం ఉందట.

ఇక, ఈ మూవీ హిట్ కోసం రష్మిక ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. టాలీవుడ్ లో ఆమె నటిస్తున్న అతి పెద్ద సినిమా ఇదే. మరో వైపు బాలీవుడ్ లో ప్రస్తుతం రష్మిక చేతిలో చాలా ఆఫర్లు ఉన్నాయి. రణబీర్ కపూర్ తో కలిసి యానిమల్ మూవీలో నటించింది. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది కాకుండా, ఆమె చేతిలో బాలీవుడ్ లో మరో రెండు సినిమాలు కూడా ఉన్నాయి. ఇక, తమిళంలో ధనుష్ మూవీలో నటించడానికి ఆమె ఒకే చేశారు. ఆ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

Tags:    

Similar News