రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్'.. రిలీజ్ ఎప్పుడంటే?
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. మేకర్స్ తాజాగా రిలీజ్ ప్రోమో విడుదల చేశారు.;
నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. అలా సక్సెస్ జోష్ లో ఉన్న ఆమె.. లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ ది గర్ల్ ఫ్రెండ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దసరా ఫేమ్ కన్నడ యాక్టర్ దీక్షిత్ శెట్టి నటిస్తున్న ఆ సినిమాను రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.
గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఆ సినిమాను విభిన్నమైన ప్రేమ కథతో రూపొందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. మేకర్స్ తాజాగా రిలీజ్ ప్రోమో విడుదల చేశారు.
ఓ కేఫ్ లో రక్షిత్ శెట్టి, రష్మిక ఉన్న సీన్ తో ప్రోమో స్టార్ట్ అయింది. సర్ ఇది ఒకటే కావాలా రెండూ తెచ్చేమంటారా అని వెయిటర్ అడగ్గా.. వెంటనే దీక్షిత్ శెట్టి రెండూ తెచ్చేయ్ అంటారు. ఆ తర్వాత 8 గంటలకు కల్లా రెడీ ఉండు అంటూ రష్మికతో అనగా.. అందరికీ ఒక టైప్ ఉంటుంది కదా.. నేను నీ టైప్ ఏనా అని అడుగుతుంది.
"ఒకరికొకరు కరెక్ట్ అని ఎలా తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది. నేను నీకు కరెక్ట్ అని ఆలోచిస్తున్నా. రకరకాల రీజన్స్ తో రిలేషన్ షిప్ స్టార్ట్ అవుతుంది. కానీ ఈ క్లారిటీ ఎంతమందికి ఉంది" అని రష్మిక చెబుతుంది. అప్పుడు దీక్షిత్ శెట్టి నీకు ఉందా అని అడగ్గా.. నవంబర్ 7వ తేదీన థియేటర్స్ కు రండి మాట్లాడుకుందామని అంటోంది.
అలా సినిమా రిలీజ్ డేట్ ను నవంబర్ 7వ తేదీ అంటూ రివీల్ చేశారు. మరో నెల రోజుల్లో మూవీ రిలీజ్ కానుండగా.. ఇప్పుడు గ్లింప్స్ తో ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. అయితే గ్లింప్స్ చివర్లో సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ ను యాడ్ చేయగా.. అవి ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. మూవీపై ఆసక్తిని రేపుతున్నాయి.
అదే సమయంలో గ్లింప్స్ లో దీక్షిత్ శెట్టి చాలా డీసెంట్ గా కనిపించారు. సెటిల్డ్ గా యాక్ట్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. రష్మిక మందన్న మరోసారి నటనతో ఆకట్టుకుంటారని అర్థమవుతోంది. తన పాత్రలో ఒదిగిపోయి కనిపిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెర్ఫెక్ట్ గా సెట్ అయింది. ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ మూవీ గ్లింప్స్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.