డాడీ బిజినెస్ అంటే..రష్మిక నో చెప్పిందా!
కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా నీరాజనాలు అందుకుంటుంది.;
కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా నీరాజనాలు అందుకుంటుంది. అదృష్టం అంటే ఇలా కలిసి రావాలని ఆ అదృష్టానికే పర్యాయ పదంలా మారిపోయింది. ఎంత కష్టపడినా కొందరికి ఎలాంటి ఫలితం ఉండదు. ఎలాంటి కష్టం లేకున్నా? కొందరు ఈజీగా సక్సెస్ అవుతుంటారు. లక్కీగా ఇండస్ట్రీకి కనెక్ట్ అవుతుంటారు. అందులో రష్మిక ఎంతో లక్కీ గాళ్. అందుకే అనతి కాలంలో నేషనల్ క్రష్ గా మారిపోయింది.
సీనియర్ హీరోలు సైతం తమ క్రష్ రష్మిక అంటూ ఎంతో ఓపెన్ గానే అంటున్నారు? అంటే రష్మిక ఏ రేంజ్ సక్సెస్ ను అందుకుందో అద్దం పడుతుంది. ఇలాంటి సక్సెస్ వస్తుందని రష్మిక ఎప్పుడూ ఊహించి ఉండదు. ఎందుకంటే రష్మిక సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదుట. తన ప్రణాళికలో సినిమా అనేది లేదుట. ఇంట్లో సినిమాలు చేయడం అంటే ఇష్టం లేదట. ముఖ్యంగా డాడ్ కు సినిమాలంటే నచ్చవట. ఆ కారణంగా సినిమాల్లోకి వెళ్తానంటే వద్దని వారించారట.
ఇంట్లో ఉండి వ్యాపారం చూసుకోమన్నారుట. కానీ అనుకోకుండా సినిమాల్లోకి రావడం...సక్సస్ అవ్వడం జరిగినట్లు గుర్తు చేసుకుంది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత మాత్రం చాలా కష్టపడినట్లు చెప్పుకొచ్చింది. ఆందోళనలు, సందేహాలు అన్నింటిని పక్కన బెట్టి పనిచేసుకుంటూ వెళ్లడం అలవాటు చేసుకుందిట. అదే తన సక్సెస్ కు కారణంగా చెబుతుంది. ఇప్పటికే అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లవుతుంది. ఈ ప్రయాణం ఎంతో కష్టంతో కూడుకున్నదే అయినా దానికి తగ్గ ఫలితాలతో సంతోషంగా ఉన్నట్లు వెల్లడించింది.
ఈ క్రమంలో ఎన్నో ఎదురు దెబ్బలతో పాటు, మంచి విషయాలు కూడా తెలుసుకున్నట్లు గుర్తు చేసుకుంది. విజయాలను నిలబెట్టుకోవడం అన్నది అతి పెద్ద సవాల్ గా మారిందని పేర్కొంది. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ చిత్రాలపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముంబైలో మకాం వేసి అక్కడ సీరియస్ గా కెరీర్ ని ప్లాన్ చేసుకుంది. అలాగని టాలీవుడ్ కి దూరం కాలేదు. మంచి అవకాశాలతో ఇక్కడా కొనసాగుతుంది.