'యానిమల్' చూడమని బలవంతం చేయలేదు: రష్మిక
``సినిమాలతో ప్రభావితం అయ్యేట్టు ఉంటే మీకు నచ్చినవి మాత్రమే చూడండి. ప్రతి సినిమా చూడమని ఎవరూ ఎవరినీ బలవంతం చేయరు.;
``సినిమాలతో ప్రభావితం అయ్యేట్టు ఉంటే మీకు నచ్చినవి మాత్రమే చూడండి. ప్రతి సినిమా చూడమని ఎవరూ ఎవరినీ బలవంతం చేయరు. అలా అయితే ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది`` అని అన్నారు రష్మిక మందన్న. రణబీర్ కపూర్- రష్మిక మందన్న, అనీల్ కపూర్ ప్రధాన పాత్రల్లో సందీప్ వంగా తెరకెక్కించిన యానిమల్ కొన్ని నెలల క్రితం పాన్ ఇండియాలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.
ఇంత కాలం తర్వాత కూడా ఈ సినిమా గురించి ఏదో ఒక చోట చర్చ సాగుతోంది అంటే దాని ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవాలి. ఇది కొన్ని వర్గాల ప్రజలు, విమర్శకుల నుంచి తీవ్రమైన దూషణలను ఎదుర్కొంది. సందీప్ వంగాను తీవ్రంగా విమర్శించారు. అలాగే రణబీర్ పాత్రను అంత క్రూరంగా చూపించినందుకు కూడా హృదయాలు గాయపడ్డాయి. అయితే ఇలాంటి సినిమాలతో ప్రభావితం అవుతామనే భయం ఉంటే చూడటం మానేయడమే ఉత్తమమని రష్మిక అన్నారు. నచ్చినవి చూడండి.. ఎవరూ బలవంతం చేయరు! అని సెటైరికల్‌గానే స్పందించింది రష్మిక.
మనలో ప్రతి ఒక్కరిలో గ్రేషేడ్ అనేది ఉంటుంది. మనం ఎప్పుడూ బ్లాక్ అండ్ వైట్ కాదు. గ్రేషేడ్ ఉండి తీరుతుంది. సందీప్ వంగా ఒక గందరగోళ వ్యక్తిత్వాన్ని తెరపై చూపించాలనుకున్నారు.. చూపించారు. అది బాక్సాఫీస్ వద్ద వర్కవుటవుతుందని నాకు అనిపించింది. దీన్ని ఇష్టపడటం లేదా ఇష్టపడకపోవడం అది ప్రజల ఇష్టం. వ్యక్తిగత విషయం అది. మేము ఒక సినిమా చేసాము. సినిమాని సినిమాగానే చూడాలి. పాత్రలను పోషించే నటులపై తీర్పు చెప్పకూడదు. నిజానికి ఒక కాజ్ కోసం నటన.. తెరపై పాత్రలకు, బయట వ్యక్తిత్వాలకు పోలిక ఉండదు. ప్రతిదీ భిన్నంగా ఉంటుంది అని రష్మిక అన్నారు.