'ది గర్ల్‌ఫ్రెండ్' ట్విస్ట్.. కావాలనే మిస్ డైరెక్ట్ చేశాం: రాహుల్ రవీంద్రన్

రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమా మెల్లగా క్యూరియసిటీని క్రియేట్ చేసుకుంటోంది.;

Update: 2025-10-30 11:43 GMT

రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమా మెల్లగా క్యూరియసిటీని క్రియేట్ చేసుకుంటోంది. నవంబర్ 7న గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్ ద్వారా లవ్ స్టోరీలో ఏదో ఇంటెన్స్, డార్క్ యాంగిల్ ఉందని హింట్ ఇచ్చారు. ఈ విషయంపై రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ, "మేము కావాలనే ఆడియెన్స్‌ను ట్రైలర్‌లో మిస్ డైరెక్ట్ చేశాం. అసలు కథ వేరే ఉంది" అంటూ పెద్ద సస్పెన్స్ క్రియేట్ చేశారు.

"ట్రైలర్‌లో మీరు చూసిన ఆ హై వోల్టేజ్ ఇంటెన్స్ డ్రామా మొత్తం సినిమా సెకండాఫ్‌లో ఉంటుంది. ఆ డ్రామా మిమ్మల్ని ఖచ్చితంగా సర్ప్రైజ్ చేస్తుంది" అని రాహుల్ కాన్ఫిడెంట్‌గా చెప్పారు. ఈ కథను తను కాలేజీలో ఉన్నప్పుడు చూసిన ఒక సంఘటన ఆధారంగా అలాగే ఒక పాట ఆధారంగా రాసుకున్నానన్నారు. ఇది ఒక ప్రేమ జంట జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనలకు దగ్గరగా ఉంటుందని, కానీ ఎవరికీ నీతులు, సందేశం చెప్పే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

నిజానికి ఈ కథను మొదట 'ఆహా' ఓటీటీ కోసం అనుకున్నారట. కానీ, గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారు కథ గురించి విని, "ఇది ఓటీటీకి కాదు, సినిమాకు కావాల్సిన కంటెంట్" అని చెప్పి, దీన్ని థియేట్రికల్ ప్రాజెక్టుగా మార్చారని రాహుల్ రివీల్ చేశారు. రష్మిక కూడా స్క్రిప్ట్ చదివిన రెండు రోజులకే ఫోన్ చేసి, "ఒక అమ్మాయిగా ఈ కథకు చాలా కనెక్ట్ అయ్యాను, ఇది బయట అమ్మాయిలందరికీ నేను ఇచ్చే బిగ్ హగ్ లాంటిది" అని చెప్పి వెంటనే ఓకే చేసిందని తెలిపారు.

ఈ స్క్రిప్ట్ విషయంలో సమంత ఇచ్చిన సలహాను కూడా రాహుల్ షేర్ చేసుకున్నారు. "నేను రాసిన ఈ కథ సమంతకు పంపాను. ఆమె చదివి, ఈ పాత్ర నేను కాకుండా వేరే కొత్త హీరోయిన్ చేస్తేనే బాగుంటుందని సలహా ఇచ్చింది" అన్నారు. అలాగే, 'యానిమల్' టైమ్‌లో రష్మిక ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేనన్నారు. "యానిమల్ వందల కోట్లు వసూలు చేస్తుంటే, నేను భయపడ్డాను. కానీ రష్మికే నన్ను కూల్ చేసి, ఈ కథకు రియలిస్టిక్‌గానే ఉండాలి అని సపోర్ట్ చేసింది" అని చెప్పారు.

ఈ సినిమాలో ఒక లెక్చరర్ పాత్ర ఉందని, దానికోసం మొదట సందీప్ రెడ్డి వంగాను అడిగానని, కానీ ఆయన "నన్ను చూస్తే ఆడియెన్స్ నవ్వుతారు" అని సున్నితంగా రిజెక్ట్ చేయడంతో, చివరికి ఆ పాత్ర తానే చేయాల్సి వచ్చిందని రాహుల్ తెలిపారు.

మొత్తానికి, 'ది గర్ల్‌ఫ్రెండ్' ట్రైలర్ కేవలం శాంపిల్ మాత్రమేనని, అసలైన సర్ప్రైజ్ ప్యాకేజ్ థియేటర్లో ఉందని రాహుల్ పెద్ద హైప్ ఇచ్చారు. ఇక ఈ సినిమా తర్వాత రష్మికతో మరో సినిమా కూడా చేయబోతున్నట్లు, ఆ లైన్ కూడా ఆమెకు నచ్చిందని రాహుల్ కన్ఫర్మ్ చేశారు.

Tags:    

Similar News