• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నేష‌న‌ల్ క్ర‌ష్ కెరీర్ లో...

నేష‌న‌ల్ క్ర‌ష్ కెరీర్ లో తొలి హ్యాట్రిక్!

| నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మికా మంద‌న్నా కెరీర్ పాన్ ఇండియాలో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-02-18 14:30 GMT

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మికా మంద‌న్నా కెరీర్ పాన్ ఇండియాలో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే `ఛావా` స‌క్సెస్ తో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది. ఈ విజ‌యంతో ర‌ష్మిక కెరీర్ లో స‌రికొత్త రికార్డులు న‌మోద య్యాయి. ర‌ష్మిక కెరీర్ లో ఇంత‌వ‌ర‌కూ హ్యాట్రిక్ న‌మోదు కాలేదు. తొలిసారి `ఛావా` విజ‌యంతో అది సాధ్యమైంది. `యానిమ‌ల్`, `పుష్ప‌-2` త‌ర్వాత రిలీజ్ అయిన ఛావా కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో ఈ రికార్డు న‌మోదైంది.

అమ్మడి కెరీర్ లో చాలా విజ‌యాలున్నాయి. కానీ ఆ విజ‌యాలు వ‌రుస‌గా లేవు. శాండిలవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ మూడు భాష‌ల్లోనే ఇదే త‌ర‌హాలో విజ‌యాలు అందుకుంది. అయితే బాలీవుడ్ చిత్రం `ఛావా`తో హ్యాట్రిక్ న‌మోద‌వ్వ‌డం ఒక ఎత్తైతే? ర‌ష్మిక కెరీర్ లో తొలి చారిత్రాత్మ‌క చిత్రం విజ‌యం సాధించ‌డం కూడా ఇదే మొద‌టిసారి. ఇప్ప‌టికే ఈ సినిమా 200 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది.

`యానిమ‌ల్` చిత్రం ర‌ష్మిక కెరీర్ లో తొలి 900 కోట్ల వ‌సూళ్ల చిత్రంగా నిలిచింది. ఆ త‌ర్వాత రిలీజ్ అయిన పుష్ప ఏకంగా 1800 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. ప్ర‌స్తుతం బాక్సాఫీస్ వ‌ద్ద `ఛావా` హ‌వా కొన‌సా గుతుంది. ఈ సినిమా 300 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధిస్తుంద‌ని ఓ అంచ‌నా. అంత‌కు మించి 500 కోట్లు కొల్ల‌గొట్టినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. ప్ర‌స్తుతం ర‌ష్మిక బాలీవుడ్ లో స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న `సికింద‌ర్` లో న‌టిస్తోంది.

అలాగే `థామా`లోనూ న‌టిస్తోంది. శేఖ‌ర్ క‌మ్ములా తెర‌కెక్కిస్తోన్న పాన్ ఇండియా చిత్రం `కుభేర` లోనూ న‌టిస్తోంది. `సికింద‌ర్`, `కుభేర‌`పై భారీ అంచ‌నాలున్నాయి. ఈ సినిమాలు కూడా విజ‌యం సాధిస్తే? రష్మిక వేగాన్ని ఆప‌డం అసాధ్య‌మే.

Tags:    
  • Rashmikamandanna 
  • Chhaava 
  • Pushpa2 
  • Animalmovie 
  • Ranbirkapoor 
  • Alluarjun 
  • Rashmika 
  • Vickykaushal 
  • Bollywood 
  • Rashmikamovies 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS