ర‌ష్మిక‌కు అక్రోఫోబియాతో ఒణికిపోతుందా?

తాజాగా ర‌ష్మిక‌ జీవితంలో ఓ బలహీనతను ఎలా అధిగమించిందో? రివీల్ చేసింది.

Update: 2026-05-14 06:29 GMT

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటనతోనే కాదు. తన వ్యక్తిత్వంతోనూ ఎంతోమంది అభిమానులను సంపాదిం చుకుంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ నెటిజ‌న్ల‌ను ఆక‌ర్షించ‌డంలోనూ కన్నడ కస్తూరి ముందుం టుంది. తాజాగా ర‌ష్మిక‌ జీవితంలో ఓ బలహీనతను ఎలా అధిగమించిందో? రివీల్ చేసింది. షూటింగ్ నిమిత్తం కొచ్చిలో ఉన్న సమయంలో ఎంతో కాలంగా ఉన్న ఎత్తు భయాన్ని ఆమె ధైర్యంగా ఎదుర్కొంది. సాధారణంగా రష్మిక ఎంతో ఉత్సాహంగా? సాహసోపేతంగా కనిపిస్తుంది. కానీ అమ్మ‌డికి అక్రోఫోబియా (ఎత్తును చూస్తే కలిగే భయం) ఉందని చాలామందికి తెలియదు.

కొచ్చిలో ఓ హోటల్‌లో బస చేసినప్పుడు అక్కడి ఎత్తైన ప్రదేశం నుండి ప్రకృతిని వీక్షించే అవకాశం వచ్చినప్పుడు మొదట ఎంతో భయపడిందట. అయితే ఆ భయాన్ని అలాగే ఉంచుకోకూడదని నిర్ణయించుకుని తనను తాను సవాలు చేసుకున్నట్లు రష్మిక పేర్కొంది. ఆ ఎత్తైన ప్రదేశం నుంచి కిందకు చూడటం మొదట్లో ఎంతో కష్టమైందని గుండె వేగంగా కొట్టుకుందని వివరించింది. `మనం దేని గురించి అయితే భయపడతామో? దాన్ని నేరుగా ఎదుర్కొన్నప్పుడే ఆ భయం పోతుంది` అనే సూత్రాన్ని ఆమె ఈ సందర్భంగా పాటించింది.

మెల్లగా ఆ ఎత్తుకు అలవాటు పడి ప్రకృతి అందాలను ఆస్వాదించడం మొదలుపెట్టాక తనలో తెలియని విజయం కలిగినట్లు చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు రష్మిక ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. `రియల్ లైఫ్ శ్రీవల్లి అంటే ఇవే కదా సాహసాలు` అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. సెలబ్రిటీలు తమ బలహీనతలను బయటపెట్టడమే కాకుండా వాటిని ఎలా అధిగమించాలో కూడా చెప్ప‌వ‌డం వల్ల తమకు ఎంతో స్ఫూర్తిగా ఉంటుందని నెటిజన్లు పేర్కొంటున్నారు. రష్మిక దినచర్యను - తన భావాలను ఎప్పటి కప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకోవడం ఆమెకున్న ప్రత్యేక శైలిగా చెప్పొచ్చు.

ప్రతి ఒక్కరిలో ఏదో ఒక భయం ఉంటుంది. కానీ దాన్ని ఎదుర్కొన్నప్పుడే వ్యక్తిగత ఎదుగుదల సాధ్యమవుతుంది. రష్మిక చేసిన సాహసం భయాలను పారద్రోలడానికి స్ఫూర్తినిస్తోంది. కొచ్చి అందాలను వీక్షిస్తూనే భయాన్ని జయించిన రష్మిక ఇప్పుడు మరింత ఉత్సాహంతో తదుపరి షూటింగ్స్ లో పాల్గొంటుంది. ఇటీవ‌లే విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను వివాహం చేసుకుని ధాంప్త‌య జీవితంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. వృత్తిపై త‌న‌కున్న నిబ‌ద్ద‌త‌తో పెళ్లి అనే కార‌ణాన్ని చూపించి అమ్మ‌డు ఏమాత్రం స‌మ‌యం వృదా చేయ‌లేదు. కొత్త దంపతులైనా? వ్య‌క్తిగ‌త జీవితం కంటే ? వృత్తి ప‌ర‌మైన జీవితానికే ఇద్ద‌రు ప్రాధాన్య‌త ఇచ్చి ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు.

Tags:    

Similar News