• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వింటర్ స్టైల్‌లో...

వింటర్ స్టైల్‌లో అదరగొట్టిన నేషనల్ క్రష్!

| ఈ ఫోటోలలో రష్మిక నగర వాతావరణంలో వింటర్ వేర్‌ను సరిగ్గా ప్రదర్శిస్తూ స్టన్నింగ్ లుక్స్ లో కనిపిస్తోంది.

By - Tupaki Desk
Update: 2024-10-17 08:29 GMT

 స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న సోషల్ మీడియాలో తన గ్లామర్ తో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఆమె చేసిన ఫోటోషూట్ మరోసారి అందర్నీ ఆకట్టుకుంది. రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో Onitsuka Tiger Autumn Winter 2024 కలెక్షన్‌ను ప్రదర్శిస్తూ కొన్ని అద్భుతమైన ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో రష్మిక నగర వాతావరణంలో వింటర్ వేర్‌ను సరిగ్గా ప్రదర్శిస్తూ స్టన్నింగ్ లుక్స్ లో కనిపిస్తోంది.


ఫోటోషూట్‌లో భాగంగా, రష్మిక టాప్ నాట్ లో జుట్టు సర్దుకుని, చలికాలం ఫ్యాషన్ అవుట్‌ఫిట్స్‌లో దర్శనమిచ్చింది. ఒక ఫోటోలో బ్లాక్ జాకెట్ ధరించి, ఆకర్షణీయమైన పోజ్ లో నిలబడిన రష్మిక ఆ లుక్‌కి మరో సొగసును తీసుకొచ్చింది. మరో ఫోటోలో ఆమె పర్ఫెక్ట్ టోన్ మేకప్‌తో సహజత్వం కనబరిచింది. రష్మిక తన ఫ్యాషన్ సెన్స్‌తో మామూలుగా ఉండదు అని మరోసారి ప్రూవ్ చేసింది.


రష్మిక సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం ఆమె చేతి నిండా పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. బాలీవుడ్‌లో విక్కీ కౌశల్ సరసన 'చావా' సినిమాలో నటిస్తోంది. అదే విధంగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కుబేర' అనే సినిమాతో బిజీగా ఉంది. వీటితో పాటు 'గర్ల్‌ఫ్రెండ్' మూవీలో దీక్షిత్ శెట్టితో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఇవి కాకుండా, టాలీవుడ్‌లో అద్భుతమైన విజయం సాధించిన 'పుష్ప' సీక్వెల్ 'పుష్ప 2' లో శ్రీవల్లిగా రష్మిక మరోసారి అలరించనుంది.


రష్మిక కెరీర్‌లో మొదటగా కన్నడ సినిమాలతో నటన మొదలుపెట్టినా, తెలుగులో ఆమెకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. 'గీత గోవిందం,' 'సరిలేరు నీకెవ్వరు' వంటి సినిమాలతో ఆమె టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారింది. ఇప్పుడు నార్త్ ఇండియా వరకు తన సత్తా చాటుకుంటూ పాన్ ఇండియా స్టార్‌గా ఎదుగుతోంది. రష్మిక అందం, అభినయం మాత్రమే కాదు, ఆమె ఫ్యాషన్ సెన్స్ కూడా ప్రతిసారీ హైలైట్ అవుతూ ఉంటుంది.

Tags:    
  • Rashmikamandanna 
  • Actress 
  • Trendinglooks 
  • Trendingclicks 
  • Pictalk 
  • Actressrashmikamandanna 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS