ఆయన పక్కనుంటే ఎవరికీ మరో ఆప్షన్ ఉండదు
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో రష్మిక హీరోయిన్ గా నటించిన సినిమా కుబేర. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో హిట్ దిశగా దూసుకెళ్తుంది.;
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో రష్మిక హీరోయిన్ గా నటించిన సినిమా కుబేర. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో హిట్ దిశగా దూసుకెళ్తుంది. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ కుబేర మంచి పేరును తెచ్చిపెట్టింది. అందులో భాగంగానే కుబేరలో సమీరా పాత్రలో నటించిన రష్మికకు కూడా మంచి ప్రశంసలొస్తున్నాయి.
కుబేర సినిమాలో తన పాత్రకు వస్తున్న ప్రశంసలకు రష్మిక ఇప్పుడు గాల్లో తేలిపోతుంది. ఈ విషయాన్ని స్వయంగా తానే తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కుబేర సినిమాలో తన పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోందని, శేఖర్ కమ్ముల గారి వల్లే సమీరా క్యారెక్టర్ అంత బాగా పండిందని, తాను కేవలం ఆయన చెప్పింది చెప్పినట్టు మాత్రమే చేశానని చెప్పుకొచ్చింది.
శేఖర్ కమ్ములకు సినిమాపై ఉండే ప్యాషన్ స్క్రీన్ పై కనిపిస్తూ ఉంటుందని, ఆ ప్యాషన్ చూసే ఆయనతో వర్క్ చేయాలని ఎంతో కాలంగా అనుకుంటున్నానని, కుబేరతో తనకు ఆ ఛాన్స్ వచ్చిందని, శేఖర్ కమ్ముల తనకెంతో ఫ్రీడమ్ ఇచ్చారని అందుకే ఆయన చెప్పినట్టు చేయగలిగానని, సమీరా పాత్రకు వచ్చే ప్రశంసలన్నీ ఆయనకే దక్కాలన్నట్టు రష్మిక శేఖర్ కమ్ముల గురించి రాసుకొచ్చింది.
గొప్ప నటులతో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు మనం మరింత జాగ్రత్త పడాల్సి ఉంటుందని, వారిని అందుకోవాలంటే ది బెస్ట్ ఇవ్వాల్సి ఉంటుందని, ధనుష్ లాంటి గొప్ప నటుడు మన ముందు ఉంటే మనం కూడా అలానే నటించాలని, అది తప్ప వేరే ఆప్షన్ ఉండదని, దేవాతో కలిసి సమీరా క్యారెక్టర్ ను చేయడం ఎంతో ఆనందంగా ఉందని రష్మిక తెలిపింది.
అదే పోస్టులో నాగార్జున గురించి కూడా రష్మిక రాసింది. నాగార్జున గారు కుబేరలో చేసిన క్యారెక్టర్, యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని, ఆయన నటనను వర్ణించడానికి మాటలు కూడా సరిపోవని, ఓ వ్యక్తిగా, యాక్టర్ గా ఆయన్ను తానెప్పుడూ ఆరాధిస్తూనే ఉంటానని, ఆయన్నుంచి తానెంతో స్పూర్తి పొందానని, నాగార్జున ది బెస్ట్ అని రష్మిక తన పోస్టులో రాస్తూ కుబేర టీమ్ ది బెస్ట్ టీమ్ అని, అందరూ అద్భుతంగా వర్క్ చేశారని, కుబేర సినిమాలోని వర్కింగ్ స్టిల్స్ ను పోస్ట్ చేసింది రష్మిక. ఆమె చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.