రష్మిక 'చెన్నై' పోస్ట్.. కన్నడిగులు ఫీల్ అయ్యారా?
కుబేరలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున లీడ్ రోల్స్ పోషించగా.. రష్మిక ఫిమేల్ లీడ్ లో కనిపించనున్నారు.;
స్టార్ హీరోయిన్ రష్మిక.. ఇప్పుడు కెరీర్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. నార్త్ టు సౌత్ వరుస సినిమాలతో అలరిస్తున్నారు. నాన్ స్టాప్ గా షూటింగ్స్ తో బిజీగా గడుపుతున్నారు. ఇప్పుడు కుబేర మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జూన్ 20వ తేదీన వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుందీ చిత్రం.
కుబేరలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున లీడ్ రోల్స్ పోషించగా.. రష్మిక ఫిమేల్ లీడ్ లో కనిపించనున్నారు. అయితే పాన్ ఇండియా మూవీ కనుక.. మేకర్స్ సినిమాను అంతే విధంగా ప్రమోట్ చేస్తున్నారు. అదే సమయంలో రష్మిక.. ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. తన వంతు న్యాయంగా ప్రమోట్ చేస్తున్నారు.
రీసెంట్ గా చెన్నైలో జరిగిన ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారని చెప్పాలి. ప్యాస్టల్ కలర్ సూపర్ డ్రెస్ లో తళుకుమన్న భామ.. తన గ్లామర్ తో మెప్పించారు. ఇప్పుడు ఆ పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అమ్మడు.. లాంగ్ నోట్ ను రాసుకొచ్చారు. చెన్నైతో తనకున్న అనుబంధాన్ని షేర్ చేసుకుంటూ, టీమ్ కోసం మాట్లాడారు.
"కుబేరా ప్రమోషన్లను చెన్నైలో ప్రారంభించాం. మీలో చాలా మందికి తెలిసినట్లుగా చెన్నైలోనే నా బాల్యం గడిచింది. దీంతో నా హృదయంలో చెన్నై ప్రియమైన స్థానాన్ని కలిగి ఉంది. ఎంత అద్భుతమైన సాయంత్రం అది!" అంటూ రాసుకొచ్చారు రష్మిక. కుబేర టీమ్ క్రియేట్ చేసిన మ్యాజిక్ కోసం వెయిట్ చేయండని కోరారు.
అయితే చెన్నైకి తన హృదయంలో ప్రత్యేక స్థానమని పెట్టిన రష్మిక పోస్ట్.. కొందరు కన్నడిగులకు ఆగ్రహం తెప్పించిదట. ఆమెది చెన్నై అన్నట్లే పోస్ట్ పెట్టారని కొందరు అభిప్రాయపడుతున్నారు. పుట్టి పెరిగి స్కూల్ చదువుకున్నదంతా కర్ణాటకలో అయితే.. చెన్నైలో బాల్యం గడవడం ఏంటని ఇప్పుడు కన్నడ నెటిజన్లు అంటున్నారు.
రష్మిక ఏ ఉద్దేశ్యంతో పెట్టారో గానీ.. ఇప్పుడు ఆ పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల ముందు కన్నడ సూపర్ హిట్ కాంతార మూవీ చూడలేదని అనడంతో అనేక మంది ట్రోల్స్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ తనకు ఇల్లు లాంటిదని వ్యాఖ్యానించడంతో విమర్శించారు. ఇప్పుడు చెన్నైలో బాల్యం గడిచిందని అనడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై రష్మిక స్పందిస్తార వేచి చూడాలి.