రాశిఖన్నా రియలైజ్ అయ్యిందా.. ఆ మాటలకు అర్థం?
తాజాగా హైదరాబాదులో విలేకరులతో మాట్లాడుతూ.. "ఇప్పటివరకు నేను తెరపై చూడని ఒక కొత్త కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు.;
సిచువేషన్ డిమాండ్ చేస్తే ఎవరైనా ఎలాంటి పాత్రలలోనైనా చేయాల్సి వస్తుంది. కానీ కొంతమంది అలాంటి పాత్రలు చేయము.. ఇలాంటి కథలు మాకు సెట్ కావు అంటూ భీష్ముంచుకు కూర్చుంటారు. అయితే అలా పట్టుబడితే ఇండస్ట్రీలో అవకాశాలు రావని, పాత్రకు తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోవాలి అని ప్రముఖ యంగ్ బ్యూటీ ,స్టార్ హీరోయిన్ రాశి ఖన్నా స్పష్టం చేసింది. ముఖ్యంగా ఈమె చెబుతున్న మాటలు వింటే మాత్రం నిజంగానే ఈమె రియలైజ్ అయ్యిందా? అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతోంది? అనే అనుమానాలు కలగకమానదు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
అసలు విషయంలోకి వెళ్తే.. సిద్దు జొన్నలగడ్డ హీరోగా.. శ్రీనిధి శెట్టి, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'తెలుసు కదా'. దీపావళి సందర్భంగా అక్టోబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నీరజా కోన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విడుదలకు కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో వేగంగా పాల్గొంటున్నారు చిత్ర బృందం. అందులో భాగంగానే రాశి ఖన్నా కూడా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో విషయాలను పంచుకుంటోంది.
తాజాగా హైదరాబాదులో విలేకరులతో మాట్లాడుతూ.. "ఇప్పటివరకు నేను తెరపై చూడని ఒక కొత్త కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు. తెలుసు కదా ముక్కోణపు ప్రేమ కథ. అయినా ఇందులో విభిన్నమైన కథాంశంతో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. నీరజ ఈ కథ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నేను నటిస్తున్న రెండో చిత్రం ఇది. కచ్చితంగా మీకు ఈ సినిమా ఒక మంచి అనుభూతిని ఇస్తుంది" అంటూ తెలిపింది.
అలాగే మాట్లాడుతూ.."సాధారణంగా మనం ప్రణాళిక వేసుకున్నంత మాత్రాన అలాగే జరుగుతుంది అనేది ఊహ మాత్రమే. చిత్ర పరిశ్రమలో ఏదైనా సరే దానంతట అదే జరగాల్సిందే. నా దగ్గరకు వచ్చిన కథల్లో ఏది బాగుంది అనిపిస్తే.. దానిని మాత్రమే ఎంపిక చేసుకొని సినిమా పూర్తి చేస్తున్నాను. నాకు పురాణాలు నేపథ్యంలో కథలు, హారర్ నేపథ్యమున్న కథలో నటించడం, చూడడం ఇష్టం. అలాగని అలాంటి కథల్లోనే నేను నటిస్తాను అని కూర్చుంటే కుదరదు కదా. ఎప్పుడు ఏ భాషలో ఎలాంటి కథలో చేస్తాం అన్నది కూడా మన చేతుల్లో ఉండదు " అంటూ రాశి ఖన్నా చెప్పుకొచ్చింది. మొత్తానికైతే పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోతేనే ఇండస్ట్రీలో కొంతకాలం కొనసాగుతాము అంటూ ఇండైరెక్టుగా కామెంట్లు చేసింది రాశి ఖ. ఇక ఈమె కామెంట్లు విన్న నెటిజన్స్ మొత్తానికైతే రాశి ఖన్నా రియలైజ్ అయ్యిందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో అవకాశం పై కూడా ఆమె మాట్లాడుతూ.." ఈ సినిమా కోసం దర్శకుడు హరీష్ శంకర్ ఫోన్ చేయగానే ఇంకో ఆలోచన లేకుండా వెంటనే ఓకే చెప్పాను. ఆ తర్వాతే నేను కథ విన్నాను. పవన్ కళ్యాణ్ తో నటించడం అనేది ఒక గొప్ప అనుభవం. ప్రస్తుతం హిందీలో కూడా నాలుగు ప్రాజెక్ట్లలో నటిస్తున్నాను" అంటూ రాశి ఖన్నా తెలిపింది.