రావు బహదూర్ అసలు కథ.. డైరెక్టర్ బెస్ట్ స్ట్రాటజీ
ఈ సినిమాలో అసలైన క్యారెక్టర్ రావు బహదూర్. అతనికి సుమారు 55 నుంచి 60 ఏళ్ల వయసు ఉంటుంది.
సత్యదేవ్ కొత్త సినిమా రావు బహదూర్ కథ ఏంటనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ట్రైలర్ తోనే మహేష్ బాబు వాయిస్ తో ఒక మ్యాజిక్ క్రియేట్ చేసిన దర్శకుడు వెంకటేష్ మహా, లేటెస్ట్ గా ఈ సినిమా అసలు స్టోరీ లైన్ ను బయటపెట్టారు. ఒక ప్రెస్ మీట్ లో సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటి, హీరో పాత్ర స్వభావం ఎలా ఉండబోతోంది అనే విషయాలను ఆయన వివరంగా చెప్పారు. డైరెక్టర్ పంచుకున్న ఈ డీటెయిల్స్ సినిమా కథ మీద మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఒక విధంగా ఇలాంటి కథలకు వివరణ ఇస్తే ఆడియెన్స్ ఒక క్లారిటితో థియేటర్ కు వస్తారు.
ఈ సినిమాలో అసలైన క్యారెక్టర్ రావు బహదూర్. అతనికి సుమారు 55 నుంచి 60 ఏళ్ల వయసు ఉంటుంది. అతను లాస్ట్ స్టేజ్ లివర్ క్యాన్సర్ తో బాధపడుతుంటాడు. కచ్చితంగా నాలుగు నెలల క్రితమే అతను చనిపోతాడని డాక్టర్లు కూడా తేల్చి చెబుతారు. కానీ ఆ చెప్పిన టైమ్ దాటినా కూడా ఆ క్యారెక్టర్ అసలు చనిపోడు. అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుందని వెంకటేష్ మహా చెప్పుకొచ్చారు.
సాధారణంగా ప్రతి సినిమాలో హీరోకి ఒక లక్ష్యం అనేది ఉంటుంది. అలాగే ఈ రావు బహదూర్ కి కూడా ఒక బలమైన పర్పస్ ఉందని దర్శకుడు తెలిపారు. అది ఏంటంటే తాను అసలు చావను అని బలంగా ఫిక్స్ అవ్వడమే. ఈ విషయం సినిమా మొదటి సీన్ లోనే ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపిస్తామని అన్నారు. అతను ఎందుకు చనిపోవట్లేదు, తన లక్ష్యం కోసం ఏం చేశాడు అనేది ఇందులో కీలకం కానుందట.
అయితే ఒక క్యాన్సర్ పేషెంట్ తన లక్ష్యాన్ని చేరుకోవడానికి బయటికి వెళ్లి పెద్ద ఫైట్లు చేయలేడు కదా. కనీసం రోడ్డు మీద నడవడానికి, ప్యాలెస్ లు దిగడానికి కూడా అతనికి ఏమాత్రం ఓపిక ఉండదు. అందుకే ఆ క్యారెక్టర్ ఒక గదిలో కూర్చుని తన చుట్టూ ఉన్న వ్యక్తుల సైకాలజీతో ఆడుకుంటాడని వెంకటేష్ మహా వివరించారు. తన కోరికను నెరవేర్చుకోవడానికి ఆ పాత్ర చుట్టూ ఉన్నవాళ్లతో ఎలాంటి డ్రామా ఆడింది అనేదే మెయిన్ పాయింట్ అని చెప్పారు.
అసలు ఈ రావు బహదూర్ ఎవరు, అతను ఎలాంటి వాడు అనేది కథలో చాలా కీలకం కాబోతోందట. ట్రైలర్ లో జీవితం బాలేనప్పుడే శక్తులు సిద్ధిస్తాయి అని డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ కి తగ్గట్టుగానే హీరో జీవితం ఎన్ని రకాలుగా, ఎన్ని స్టేజీల్లో డ్యామేజ్ అయ్యింది అనే నేపథ్యాన్ని ఈ కథలో వివరంగా చూపించబోతున్నారని తెలుస్తోంది. ఒక మనిషి జీవితంలో జరిగే ఇన్ని స్టేజెస్ ని స్క్రీన్ మీద చూడటం అనేది కచ్చితంగా కొత్తగా అనిపిస్తుంది.
ఇక ట్రైలర్ చూసినప్పుడు అనుమానం చుట్టూ కథ తిరుగుతుందని అనిపించినా, వెంకటేష్ మహా మాటలను బట్టి ఇందులో ఒక బలమైన సైకలాజికల్ డ్రామా ఉన్నట్లు తెలుస్తోంది. రొటీన్ కమర్షియల్ ఫార్ములాకు దూరంగా ఉంటూ, ఒక పేషెంట్ ఆడే మైండ్ గేమ్స్ తో థ్రిల్ చేయడానికి రెడీ అయ్యారు. పోస్టర్ జులై 3న థియేటర్లలో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని రాబడుతుందో చూడాలి.