మునుపెన్న‌డూ చూడ‌నిది... మ‌హేష్ ప్ర‌శంస‌కు వెంక‌టేష్ మ‌హా ఎమోష‌న‌ల్!

టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో.. వైవిధ్యమైన చిత్రాల దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించిన తాజా సైకలాజికల్ డ్రామా `రావు బహదుర్`.

Update: 2026-07-01 17:23 GMT

టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో.. వైవిధ్యమైన చిత్రాల దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించిన తాజా సైకలాజికల్ డ్రామా `రావు బహదుర్`. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ ప్రయోగాత్మక చిత్రానికి సూపర్ స్టార్ మహేష్ బాబు - నమ్రతా శిరోద్కర్ సమర్పకులుగా (జీఎంబి ఎంటర్‌టైన్‌మెంట్) వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ వీడియోకు మహేష్ బాబు తన పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ అందించడం చిత్ర పరిశ్రమలో.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది.

ఈ ప్రాజెక్ట్‌కు మహేష్ బాబు అందించిన అసాధారణ సహకారంపై దర్శకుడు వెంకటేష్ మహా ఇంటర్వ్యూలు, మీడియా సమావేశాల్లో పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసారు. సినిమా ఫైనల్ కట్ చూసిన తర్వాత మహేష్ బాబు ఎంతో ఇంప్రెస్ అయ్యారని వెంకటేష్ మహా తెలిపారు. ఒక కొత్త కాన్సెప్ట్‌తో సరికొత్త తరహా విజువల్ స్టోరీ టెల్లింగ్‌తో రూపొందిన ఈ చిత్రం టాలీవుడ్‌లో ముందెన్నడూ రాని ఒక సరికొత్త ప్రయత్నమని మహేష్ బాబు చిత్ర యూనిట్‌ను మనస్ఫూర్తిగా అభినందించారు. ప్రివ్యూ వీక్షించాక‌.. దాదాపు 45 నిమిషాల పాటు మ‌హేష్ ఈ సినిమా గురించి మాట్లాడార‌ని తెలిపారు.

సినిమా కంటెంట్ - వెంకటేష్ మహా టేకింగ్‌కు ఫిదా అయిన మహేష్ బాబు, ఈ సినిమా ప్ర‌చార వీడియోల‌కు తానే స్వయంగా వాయిస్ ఓవర్ ఇస్తానని ముందుకు రావడం విశేషం. నాటకానికి లాజిక్ ఉండదు అంటారు.. కానీ నాటకానికి మాయ తోడైతే లాజిక్కే మారిపోతుంది! అంటూ సాగే మహేష్ బాబు గంభీరమైన గొంతు ఈ మూవీ ట్రైలర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిందని దర్శకుడు సంతోషం వ్యక్తం చేశారు. కేవలం ఫార్మాలిటీ కోసం కాకుండా.. సినిమాలోని గాంభీర్యాన్ని అర్థం చేసుకుని మహేష్ బాబు వాయిస్ ఇవ్వడం ప్రాజెక్ట్‌కు అతిపెద్ద బూస్ట్‌గా నిలిచింది.

ఇక `రావు బహదుర్` కథాంశం గురించి వెంకటేష్ మహా మాట్లాడుతూ.. ఇదొక మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ థ్రిల్లర్, డార్క్ కామెడీ - మ్యాజికల్ రియలిజం ఎలిమెంట్స్‌తో కూడిన విభిన్నమైన సస్పెన్స్ డ్రామా అని గ‌త ఇంట‌ర్వ్యూల‌లో వివరించారు. సినిమాలో సత్యదేవ్ పోషించిన `రామప్ప` అలియాస్ రావు బహదుర్ పాత్ర చాలా ఒరిజినల్‌గా ఉంటుందని... ఒక మనిషికి వచ్చే చిన్న అనుమానం అతడి విధిని ఎలా మార్చేసింది? చివరి స్టేజ్ లివర్ క్యాన్సర్‌తో మరణానికి దగ్గరైన ఒక వ్యక్తి ఏడాది పాటు వింతగా ఎలా బతికాడు? అనే పాయింట్‌తో సినిమా సాగుతుందని పేర్కొన్నారు.

మహేష్ బాబుతో జరిగిన సుదీర్ఘ సంభాషణను గుర్తు చేసుకుంటూ.. ఆయన ఈ చిత్రాన్ని ఒక `దృశ్య కావ్యం` అని కొనియాడారని వెంకటేష్ మహా తెలిపారు. తెలుగు ప్రేక్షకులకు ఇది క‌చ్చితంగా ఒక సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుందని మహేష్ బాబు నమ్మకం వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ ఇచ్చిన ఈ భారీ సపోర్ట్- ఎండార్స్‌మెంట్ వల్ల చిన్న చిత్రంగా ప్రారంభమైన `రావు బహదుర్` ఇప్పుడు పాన్-ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Tags:    

Similar News