రణ్‌వీర్ సరసన లోకా హీరోయిన్
ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించనుందని, 2026 ఏప్రిల్ నుంచి ప్రళయ్ మూవీ షూటింగ్ ను మొదలుపెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.;
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం దురంధర్ మూవీ సక్సెస్ తో ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఈ మూవీ ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొడుతున్న నేపథ్యంలో రణ్‌వీర్ సింగ్ తర్వాత ఏ సినిమాలు చేయబోతున్నారా అని తెలుసుకోవడానికి అందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన డాన్3 సినిమా నుంచి తప్పుకోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
జాంబీ జానర్ లోకి రణ్‌వీర్
అయితే రణ్‌వీర్ తన తర్వాతి సినిమాను జై మెహతాతో కలిసి ప్రళయ్ గా చేయనున్నారని, ఈ సినిమాపైనే తన ఫుల్ ఫోకస్ ను పెట్టనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ మూవీలో లోకా సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన భామ నటించనున్నట్టు సమాచారం. బాలీవుడ్ సర్కిల్స్ ప్రకారం జై మెహతా దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రళయ్ మూవీతో జాంబీ జానర్ లోకి అడుగుపెట్టనున్నారు రణ్‌వీర్ సింగ్.
2026 నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ప్రళయ్
ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించనుందని, 2026 ఏప్రిల్ నుంచి ప్రళయ్ మూవీ షూటింగ్ ను మొదలుపెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దురంధర్ మూవీతో రణ్‌వీర్ కు వచ్చిన గుర్తింపును చూశాక, ప్రళయ్ మూవీ కళ్యాణికి మరింత స్టార్‌డమ్ ను తెచ్చిపెడుతుందని అందరూ భావిస్తున్నారు. అయితే దీనిపై ఎలాంటి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
నటుడిగానే కాదు, నిర్మాతగా కూడా!
ఇక ప్రళయ్ మూవీ విషయానికొస్తే ఈ సినిమా రణ్‌వీర్ కెరీర్లో ఓ మైల్ స్టోన్ ఫిల్మ్ గా నిలిచే అవకాశముంది. దురంధర్ మూవీతో రణ్‌వీర్ ఇప్పటికే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని స్టార్ నటుల్లో ఒకరిగా ప్రూవ్ చేసుకోగా, ఇప్పుడు ప్రళయ్ మూవీతో యాక్టింగ్ మాత్రమే కాకుండా నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టి సక్సెస్ అవాలని టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ వార్తలు నిజమైతే ప్రళయ్ మూవీ కళ్యాణికి బాలీవుడ్ లో మొదటి సినిమా కానుండగా, రణ్‌వీర్ కు నిర్మాతగా ఇది ఫస్ట్ ఫిల్మ్ అవుతుంది.