ట్రైలర్: 'యూరి' డైరెక్టర్.. ఒళ్లు గగుర్పొడిచే టార్చర్..
ఇక ట్రైలర్ చూస్తుంటే, ఇది కేవలం యాక్షన్ సినిమా కాదు, అంతకుమించి ఒళ్లు జలదరించే హింస, పచ్చి నిజాలు ఉన్నట్లు కనిపిస్తోంది.;
'యూరి: ది సర్జికల్ స్ట్రైక్' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత డైరెక్టర్ ఆదిత్య ధర్ నుంచి ఆరేళ్ల గ్యాప్ వచ్చింది. ఇంత గ్యాప్ తీసుకుని ఆయన ఏం చేస్తున్నాడా అని ఆడియన్స్ ఎదురుచూస్తుండగా, ఇప్పుడు "ధురంధర్" అంటూ ఒక పవర్ ప్యాక్డ్, రా యాక్షన్ ట్రైలర్‌తో షాక్ ఇచ్చాడు. డిసెంబర్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ చూస్తుంటే, ఇది కేవలం యాక్షన్ సినిమా కాదు, అంతకుమించి ఒళ్లు జలదరించే హింస, పచ్చి నిజాలు ఉన్నట్లు కనిపిస్తోంది.
ఈ ట్రైలర్ సినిమాలోని మెయిన్ క్యారెక్టర్లను పరిచయం చేసే తీరు చాలా భయంకరంగా ఉంది. ముఖ్యంగా అర్జున్ రాంపాల్ పోషించిన 'మేజర్ ఇక్బాల్' ISI ఏజెంట్ గా పాత్రను పరిచయం చేసిన విధానం గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఒక వ్యక్తి శరీరం నుంచి కొక్కేలతో మాంసాన్ని వేలాడదీస్తున్నట్లు చూపించిన షాట్స్ చాలా డిస్టర్బింగ్‌గా, రాగా ఉన్నాయి.
రణ్‌వీర్ సింగ్ ఈ సినిమాలో హీరోగా, ఒక కొత్త రకమైన లాంగ్ హెయిర్, గడ్డంతో రగ్డ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ట్రైలర్ మొత్తం ఇండియా పాకిస్తాన్ సెటప్‌లో, టెర్రరిజం చుట్టూ తిరుగుతుందని అర్థమవుతోంది. ఈ కథ 2000ల తొలినాళ్లలో హిజ్బుల్ ముజాహిదీన్‌లో అండర్‌కవర్‌లో చొరబడిన మేజర్ మోహిత్ శర్మ (ఇఫ్తికార్) నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ గట్టిగానే ఉంది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ పాత్ర స్ఫూర్తితో ఆర్. మాధవన్ 'అజయ్ సన్యల్'గా కనిపిస్తుండగా, సంజయ్ దత్ 'ఎస్పీ చౌదరి అస్లాం'గా, అక్షయ్ ఖన్నా 'రెహ్మాన్ డకైత్'గా పవర్ ఫుల్ రోల్స్‌లో కనిపించారు. ట్రైలర్ మొత్తం యాక్షన్ మోడ్‌లోనే సాగింది.
అయితే, ఇది రొటీన్ బాలీవుడ్ దేశభక్తి టెంప్లేట్‌ను ఫాలో అవుతుందా అనే అనుమానం కూడా కలుగుతోంది. కానీ, డైరెక్టర్ ఆదిత్య ధర్ 'యూరి'తో ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి, యాక్షన్ సీక్వెన్సులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉన్నాయి. అయితే, ట్రైలర్‌లో చూపించిన హింస డోస్ కాస్త ఎక్కువగానే ఉంది. ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.