• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ క్షణం నాకు చావంటే భయం...

ఆ క్షణం నాకు చావంటే భయం కలిగింది.. ఎమోషనల్ అయిన రణబీర్..

| బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్.. యానిమల్ మూవీ తర్వాత ఇతను టాలీవుడ్ లో కూడా బాగా ఫేమస్ అయ్యాడు.

By - Tupaki Desk
Update: 2024-07-29 07:44 GMT

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్.. యానిమల్ మూవీ తర్వాత ఇతను టాలీవుడ్ లో కూడా బాగా ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం రణబీర్ తన నెక్స్ట్ మూవీ రామాయణ కోసం రాముడి గారు రెడీ అవుతున్నాడు. ప్రతి చిత్రానికి తన పాత్రలో వైవిధ్యాన్ని కనపరుస్తూ అద్భుతమైన నటనతో స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, రణబీర్ కపూర్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి అందమైన రాహా అని కూతురు కూడా ఉంది.

సోషల్ మీడియాలో రాహా ఫొటోస్, వీడియోస్ బాగా వైరల్ అవుతూ ఉంటాయి. రాహాని చాలా వరకు ఎక్కడ చూసినా రణబీర్ ఎత్తుకునే కనిపిస్తాడు. అయితను కలిసి ఉన్నప్పుడు చూసిన ఎవరికైనా కూతురు అంటే అతనికి ఎంత ప్రేమ అన్న విషయం ఇక్కడే తెలిసిపోతుంది. రాహా పుట్టక ముందు రణబీర్ తన జీవితాన్ని చూసే తీరు వేరేగా ఉండేదని.. కూతురు పుట్టిన తర్వాత అతనిలో ఎంతో మార్పు వచ్చిందని స్వయంగా వెల్లడించారు. మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం..

తన కూతురు పుట్టకముందు అతని గడిపిన 40 సంవత్సరాల జీవితానికి.. ఆమె పుట్టిన తర్వాత ఇప్పుడు గడుపుతున్న జీవితానికి ఎంతో వ్యత్యాసం ఉంది అంటున్నాడు రణబీర్. కూతురు పుట్టక ముందు అతనికి ఆరోగ్యం పై, జీవితంపై పెద్దగా శ్రద్ధ ఉండేది కాదట.. కానీ కూతురు పుట్టిన తర్వాత మొదటిసారి జీవితం పై ప్రేమ కలగడంతో పాటు ,మరణం పై భయం పుట్టుక వచ్చింది అని రణబీర్ వెల్లడించారు.

‘రాహా పుట్టినప్పుడు నేను అనుభవించిన భావోద్వేగాలు వర్ణించలేను. అప్పటివరకు నాలో లేని ఎన్నో కొత్త అనుభూతులను నేను ఆ రోజు అనుభవించాను.. అంతేకాదు ఒక బాధ్యత కలిగిన తండ్రిగా ఉండాలి అని నిర్ణయించుకున్నాను.. గతంలో నేను సిగరెట్స్ తాగేవాడిని.. అయితే తండ్రి నాయన తర్వాత ఆ అలవాటు నాకు ఎంతో అసహ్యంగా అనిపించింది. అందుకే అలవాటు వెంటనే మానేశాను. రాహాను తీసుకువచ్చిన చేతుల్లో పెట్టినప్పుడు నా గుండెని నా చేతిలో పెట్టిన అనుభూతి కలిగింది. తీరిక దొరికినప్పుడల్లా తనతో సమయం గడపడం నాకు ఎంతో ఇష్టం.’అంటూ కూతురు మీద ప్రేమను వెల్లడించాడు ఈ స్టార్ హీరో. అంతేకాదు పాప పుట్టిన తర్వాత మరింత ఫిట్గా హెల్తీగా ఉండడానికి అతను తన జీవనశైలి, డైట్ లో చాలా మార్పులు చేశారు.

Tags:    
  • Ranabirkapoor 
  • Bollywood 
  • Filmindustry 
  • Daughter 
  • Raha 
  • Aliabhatt 
  • Animal 
  • Ramayana 

Similar News

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

Copyright @2026

Powered by Blink CMS