• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  క్యూట్ రాహా.. మళ్లీ...

క్యూట్ రాహా.. మళ్లీ నెట్టింట ట్రెండింగ్!

| అయితే చాలా నెలలపాటు తన కూతురి ముఖాన్ని చూపించని ఈ జంట.. గతేడాది క్రిస్మస్ సమయంలో రాహా కపూర్ ను కెమెరాకు పరిచయం చేశారు.

By - Tupaki Desk
Update: 2024-02-22 07:45 GMT

బాలీవుడ్ బ్యూటిఫుల్ జంటల్లో రణబీర్ కపూర్, ఆలియా భట్ కపుల్ ఒకటి. ఐదేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన ఈ టాప్ స్టార్స్.. 2022లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి ప్రేమకు గుర్తుగా పండంటి ఆడబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. అయితే తమ పాపాయి రాహా కపూర్ కోసం సినిమాలకు గ్యాప్ కూడా ఇచ్చేశారు. అటు మూవీలు చేస్తూనే.. ఇటు చిన్నారితో టైమ్ స్పెండ్ చేస్తున్నారు.

అయితే చాలా నెలలపాటు తన కూతురి ముఖాన్ని చూపించని ఈ జంట.. గతేడాది క్రిస్మస్ సమయంలో రాహా కపూర్ ను కెమెరాకు పరిచయం చేశారు. ముంబయిలో జరిగిన కపూర్ ఫ్యామిలీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కు హాజరైన రణబీర్, ఆలియా.. తమ కూతురిని మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఆ సమయంలో అంతా క్రిస్మస్ విషెస్ చెబుతూ ఫొటోలు తీశారు. అప్పట్లో రాహా పిక్స్ ఫుల్ వైరల్ అయిన విషయం తెలిసిందే.

తాజాగా రాహా కపూర్ తన సెకండ్ పబ్లిక్ అవుటింగ్ కు వచ్చింది. అందుకు సంబంధించిన ఫొటోలు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తనకు వరుస అయ్యే బావ జెహ్ (కరీనా కపూర్ రెండో కొడుకు) బర్త్ డే పార్టీకి వచ్చింది రాహా. కూల్ బ్లూ కలర్ డ్రెస్ లో రాహా ఎంతో ముద్దుగా కనిపిస్తోంది. రకరకాల ఎక్స్ ప్రెషన్స్ తో అట్రాక్ట్ చేస్తోంది. ఇప్పటి నుంచే రాహా అదరగొడుతోందని కామెంట్లు పెడుతున్నారు.

అయితే సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ రెండో కొడుకు జహంగీర్ అలీఖాన్ (జెహ్).. పుట్టినరోజు వేడుక ముంబయిలో నిన్న ఘనంగా జరిగింది. పటౌడీ ఫ్యామిలీకి చెందిన వారంతా హాజరయ్యారు. గ్రాండ్ గా జరిగిన ఈ పార్టీలో అందరూ ఎంజాయ్ చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక ఈ పార్టీకి రాహా.. తన తండ్రితో వచ్చి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

ఇక రణబీర్ కపూర్ రీసెంట్ గా యానిమల్ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ మూవీ.. పాన్ ఇండియా స్థాయిలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం రామాయణ సినిమాలోని రాముడి పాత్ర కోసం సిద్ధమవుతున్నారు. మరోవైపు, ఆలియా భట్.. జిగ్రా సినిమాలో యాక్ట్ చేసింది. ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తోంది. పోచర్ వెబ్ సిరీస్ ను కూడా ప్రొడ్యూస్ చేస్తోంది.

Who is the current South Indian No.1 Hero?#Prabhas #AlluArjun #ThalapathyVijay #Tollywood #Kollywood #Tupaki

— Tupaki (@tupaki_official) February 22, 2024
Tags:    
  • Ranabirkapoor 
  • Aliabhatt 
  • Birthdaycelebrations 
  • Jahingiralikhan 
  • Kareenakapoor 
  • Son 
  • Raha 

Similar News

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

Copyright @2026

Powered by Blink CMS