రౌడీ బ్రాండ్ తో ఈ రిస్క్ గెలవాలి
టాలీవుడ్ లో ఇమేజ్ చట్రంలో చిక్కుకోకుండా కొత్తగా ట్రై చేయడం హీరోలకు ఎప్పుడూ పెద్ద టాస్క్. అర్జున్ రెడ్డి నుంచి విజయ్ దేవరకొండ క్రియేట్ చేసుకున్న రౌడీ బ్రాండ్ యూత్ లో బాగా రిజిస్టర్ అయిపోయింది.
టాలీవుడ్ లో ఇమేజ్ చట్రంలో చిక్కుకోకుండా కొత్తగా ట్రై చేయడం హీరోలకు ఎప్పుడూ పెద్ద టాస్క్. అర్జున్ రెడ్డి నుంచి విజయ్ దేవరకొండ క్రియేట్ చేసుకున్న రౌడీ బ్రాండ్ యూత్ లో బాగా రిజిస్టర్ అయిపోయింది. ఇప్పుడు అదే బ్రాండ్ ఇమేజ్ తో అక్టోబర్ 16న రణబలి రూపంలో బాక్సాఫీస్ ముందుకు వస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ విజయ్ కెరీర్ లో ఒక పెద్ద రిస్క్ లాంటి ప్రయోగమే.
ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ చేసిన ఒక కామెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తనకు సత్య సాయి బాబా బయోపిక్ చేయాలని ఉన్నా, తనకున్న ఇమేజ్ కు ఆ పవిత్రమైన క్యారెక్టర్ ఏమాత్రం సెట్ కాదని చాలా ఓపెన్ గా చెప్పేశాడు. ఆ పాత్రను మోయలేనని ఒప్పుకోవడం వెనుక తన కెరీర్ పట్ల అతనికి ఉన్న క్లారిటీ కనిపిస్తోంది.
నిజానికి ఒక నటుడికి తాను ఏ పాత్రలు చేయగలనో తెలుసుకోవడం కంటే, ఏవి చేయకూడదో అనే క్లారిటీ ఉండటం చాలా అవసరం. తన అగ్రెసివ్ ఆటిట్యూడ్, యూత్ లో ఉన్న ఫాలోయింగ్ ఆధ్యాత్మిక పాత్రలకు సింక్ అవ్వదనే లాజిక్ ను విజయ్ ప్రాక్టికల్ గా ఆలోచించాడు. ఆ క్లారిటీ ఉండటం వల్లే రొటీన్ కు భిన్నంగా రణబలి లాంటి వైలెంట్ కాన్సెప్ట్ ను ఎంచుకునే ధైర్యం చేశాడు.
ఒకే తరహా పాత్రలు చేసుకుంటూ పోతే ఎంతటి స్టార్ అయినా బోర్ కొట్టేస్తాడు. అందుకే నటుడిగా ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేయడం తప్పనిసరి. తన కంఫర్ట్ జోన్ దాటి, యాక్షన్ కి పీరియాడిక్ టచ్ ఇచ్చి రణబలి కథను ఓకే చేయడం వెనుక కూడా అదే కసి కనిపిస్తోంది. ఇలాంటి ప్రయోగాలు సక్సెస్ అయితే హీరోలకు వచ్చే కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ లో ఉంటుంది.
ఈ ప్రయోగం వర్కౌట్ అయితే విజయ్ కు తన మార్కెట్ పరిధిని మరింత పెంచుకునే స్కోప్ దొరుకుతుంది. దర్శకులు కూడా కేవలం లవ్ స్టోరీలు, రొటీన్ మాస్ కథలు కాకుండా కొత్త తరహా స్క్రిప్ట్స్ తో ఆయన దగ్గరకు వెళ్లే వాతావరణం ఏర్పడుతుంది. అందుకే రణబలి రిజల్ట్ అటు కమర్షియల్ గానే కాకుండా విజయ్ తో కెరీర్ కు కూడా కీలకంగా మారింది. రౌడీ బ్రాండ్ ను పక్కన పెట్టకుండానే దానికి ఒక కొత్త హిస్టారికల్ యాంగిల్ జోడించి చేసిన ఈ ప్రయత్నం ఎంతవరకు నిలబడుతుందనేది అసలు టాస్క్. హీరో తన పరిమితులు తెలుసుకుని చేసిన ఈ ప్రయోగం జనాలకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి. అక్టోబర్ 16న థియేటర్ల దగ్గర ఆడియన్స్ ఇచ్చే తీర్పుతో ఈ రిస్క్ గెలిచిందో లేదో తేలిపోతుంది.