గురూజీ కాంపౌండ్ లో రానా!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో భారీ మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రం లాక్ అయినట్లు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే;
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో భారీ మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రం లాక్ అయినట్లు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. బన్నీ చేయాల్సిన స్క్రిప్ట్ తిరిగి తిరిగి తారక్ వద్దకు చేరినట్లు వినిపిస్తుంది. బన్నీ అట్లీకి లాక్ అయిన తర్వాత ఇదే స్టోరీ రామ్ చరణ్ వద్దకు వెళ్లిందని ప్రచా రంలోకి వచ్చింది. అక్కడ నుంచి తారక్ వద్దకు వెళ్లినట్లు జోరుగా వినిపిస్తుంది. తారక్ కూడా లాక్ చేసినట్లు వార్తలొస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. ఈ కథలో దగ్గుబాటా రానా ఎంటర్ అవుతు న్నాడుట. ఇందులో ప్రతి నాయకుడి పాత్రకు గురూజీ రానాని తీసుకుంటున్నట్లు కొత్త వార్త వినిపిస్తుంది. ఈ పాత్ర ఒక స్వామిజీ తరహాలో ఉంటుందని... ప్రధాన ప్రతి నాయకుడి పాత్రగా వినిపిస్తుంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలి. ఇదే నిజమైతే రానాకిది మంచి అవకాశమే. `వెట్టేయాన్` తర్వాత రానా వెండి తెరపై కనిపించలేదు. అందులో విలన్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత మళ్లి ఇంత వరకూ మరో సినిమా చేయ లేదు. హీరోగానూ కనిపించలేదు. విలన్ గానూ కనిపిం చలేదు. మధ్యలో నిర్మాతగా మాత్రమే బిజీగా ఉన్నా డు. హిరణ్యకశిష ప్రాజెక్ట్ అనుకున్నా? అది కార్యరూపం దాల్చలేదు. ఇలా కొంత కాలంగా రానా బండి లాగుతున్నాడు. తాజాగా గురూజీ రూపంలో మరో అవకాశం దక్కినట్లు అయింది.
విలన్ పాత్రలు రానాకి కొత్తేం కాదు. `బాహుబలి`తో పాన్ ఇండియాలోనే విలన్ గా ఫేమస్ అయ్యాడు. భల్లాల దేవ పాత్రతో తన కంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. మళ్లీ అంతటి బలమైన పాత్రలు రాలేదు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ ఆ రేంజ్ రోల్ ఇస్తున్నట్లే కనిపిస్తుంది.