బాబోయ్ ఇదేంటి! రానా అలాంటివన్నీ తింటాడా?

టాలీవుడ్ భల్లాలదేవుడు రానా దగ్గుబాటి అంటే మనకు గుర్తొచ్చేది ఆయన భారీ కాయం, పవర్‌ఫుల్ వాయిస్.

Update: 2026-05-27 00:30 GMT

టాలీవుడ్ భల్లాలదేవుడు రానా దగ్గుబాటి అంటే మనకు గుర్తొచ్చేది ఆయన భారీ కాయం, పవర్‌ఫుల్ వాయిస్. నటుడిగానే కాకుండా నిర్మాతగా, బిజినెస్‌మెన్‌గా ఎప్పుడూ బిజీగా ఉండే రానా.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన తిండి అలవాట్ల గురించి చెప్పిన విషయాలు విని అందరూ నోరెళ్లబెడుతున్నారు. తను ఎంత పెద్ద నాన్ వెజిటేరియన్నో చెబుతూ.. ఏకంగా అందరు భయపడే వాటిని కూడా తినేశానని షాకింగ్ నిజాలు బయటపెట్టాడు..

పాములు, మొసళ్లు కూడా తినేశా:

ఓ ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ తను పక్కా మాంసాహారినని చెప్పుకొచ్చాడు. "నేను ఫుల్ మీట్ ఈటర్. ఏ దేశానికి వెళ్లినా అక్కడ దొరికే లోకల్ ఫుడ్ కచ్చితంగా టేస్ట్ చేస్తాను. మీరు భయపడే వాటిని నేను తిన్నాను. నేను పాములు, అలిగేటర్ కూడా తిన్నాను" అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. మనోడికి హైదరాబాదీ బిర్యానీ, సీఫుడ్ అంటే ప్రాణమట.

హలీం తిని ఏడ్చేసిన భల్లాలదేవుడు:

బాహుబలి సినిమా తర్వాత, ఎన్టీఆర్ బయోపిక్‌లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర కోసం రానా చాలా బరువు తగ్గాల్సి వచ్చింది. అందుకోసం దాదాపు మూడు నెలల పాటు కష్టపడి వెజ్ డైట్ ఫాలో అయ్యాడట. 'ఘాజీ' సినిమా టైంలోనూ నాన్-వెజ్ లేకుండా చాలా కష్టపడ్డానని చెప్పాడు. షూటింగ్ అవ్వగానే నాంపల్లిలోని తన ఫ్రెండ్ రెస్టారెంట్ నుండి హలీం తెప్పించుకుని, అది నోట్లో పెట్టుకోగానే కళ్లల్లో నీళ్లు తిరిగాయని ఆ ఎమోషనల్ మూమెంట్‌ను పంచుకున్నాడు.

బాలీవుడ్‌లో గట్టి పరిచయాలు:

టాలీవుడ్ సెలబ్రిటీలలో మిగిలిన వారితో పోలిస్తే రానాకు బాలీవుడ్‌లో చాలా ఎక్కువ పరిచయాలు, ఫ్రెండ్స్ ఉన్నారు. నటుడు అవ్వకముందే ఇండస్ట్రీలో ఎన్నో పనులు చేసిన ఎక్స్ పీరియన్స్ రానా సొంతం. కేవలం నటనకే పరిమితం కాకుండా కథలు వినడం, కొత్త ప్రాజెక్ట్‌లను సెట్ చేయడం లాంటి బిజినెస్‌లలో ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు.

మెగాస్టార్‌తో ఫైట్.. దుల్కర్‌తో సినిమా:

ఇక సినిమాల విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో-ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’లో రానా ఒక పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇక చిరు వర్సెస్ రానా అంటే స్క్రీన్ ఊగిపోవడం ఖాయం. మరోవైపు గత ఏడాది దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన పీరియాడికల్ డ్రామా ‘కాంత’ సినిమాకు రానా ఒక నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా, అందులో ఒక క్రేజీ రోల్ కూడా చేశారు.

మొత్తానికి రానా కేవలం సినిమాల్లోనే కాదు, తిండి విషయంలోనూ రఫ్ఫాడిస్తాడని ఈ ఇంటర్వ్యూతో ప్రూవ్ అయిపోయింది. క్యారెక్టర్ కోసం మూడు నెలలు ఇష్టమైన నాన్-వెజ్‌ను త్యాగం చేసిన ఆయన డెడికేషన్‌కు మెచ్చుకోవాల్సిందే. ఏదేమైనా, రానా పాములు, మొసళ్లు తిన్న విషయం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News