రామ్ పోతినేని.. ఎవరెవరు లైన్ లో ఉన్నారు?

ఆయనకి సక్సెస్ లు కూడా ఎక్కువ అదే జోనర్ లో వచ్చాయి. మాస్ కథలని ప్రయత్నం చేసిన చాలా సార్లు ఫెయిల్ అయ్యారు.

Update: 2024-05-10 04:12 GMT

టాలీవుడ్ లో యంగ్ ఎనర్జిటిక్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు రామ్ పోతినేని. హ్యాండ్సమ్ లుక్స్ తో అమ్మాయిల డ్రీం బాయ్ గా రామ్ పోతినేని మారిపోయాడు. దేవదాసు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రామ్ పోతినేని తరువాత ఎక్కువగా ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీలతో కమర్షియల్ ఎంటర్టైనర్ కథలు చేశారు.

ఆయనకి సక్సెస్ లు కూడా ఎక్కువ అదే జోనర్ లో వచ్చాయి. మాస్ కథలని ప్రయత్నం చేసిన చాలా సార్లు ఫెయిల్ అయ్యారు. అయితే ఇస్మార్ట్ శంకర్ మూవీతో పూరి జగన్నాథ్ రామ్ పోతినేనికి మాస్ జోనర్ లో కమర్షియల్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఈ సినిమా తర్వాత రామ్ ఇమేజ్ కూడా పెరిగింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత చెప్పుకోదగ్గ సక్సెస్ లు రామ్ కి సొంతం చేసుకోలేదు..

చివరిగా రామ్ నుంచి వచ్చిన ది వారియర్, స్కంద సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. మాస్ కమర్షియల్ యాక్షన్ చిత్రాలుగా తెరకెక్కిన ఈ రెండు ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ తో ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాపై రామ్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. అయితే ఈ చిత్రం పలు కారణాల వలన ఆలస్యం అవుతూ వస్తోంది.

ఇదిలా ఉంటే డబుల్ ఇస్మార్ట్ సినిమా తర్వాత రామ్ చేయబోయే ప్రాజెక్ట్ లకి సంబందించిన ఆసక్తికరమైన న్యూస్ బయటకి వచ్చింది. ఇప్పటికే హరీష్ శంకర్ రామ్ కి ఒక కథ చెప్పారంట. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా రామ్ తో ఒక సినిమా చేయడం కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కాకుండా నెట్ ఫ్లిక్స్ నుంచి భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఒక వెబ్ సిరీస్ ఆఫర్ రామ్ పోతినేనికి వచ్చింది. ప్రస్తుతం అది చర్చల దశలో ఉందంట.

Read more!

కార్తీక్ దండు కూడా రామ్ పోతినేనికి ఒక థ్రిల్లర్ జోనర్ కథని నేరేట్ చేసాడంట. అయితే ఈ కథ మరో హీరో చేతికి వెళ్ళిపోయిందని తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చేతిలో ఉన్న రెండు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ లకి సంబందించి ఏదో ఒక అప్డేట్ త్వరలో బయటకి వస్తుందని టాక్ వినిపిస్తోంది.

ఈ ఏడాదిలోనే రామ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. త్రివిక్రమ్ - స్రవంతి రవి కిషోర్ కాంబినేషన్ లో అయితే రామ్ సినిమా ఎప్పటి నుంచో చర్చల దశలోనే ఉంది. ఈ ప్రాజెక్టు పై మాత్రం పక్కా ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ త్రివిక్రమ్ బన్నీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకుంటే రామ్ తో జెట్ స్పీడ్ లో ఒక సినిమా ఫినిష్ చేసే అవకాశం ఉంది.

Tags:    

Similar News