• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రూమర్స్ కి చెక్ పెట్టిన...

రూమర్స్ కి చెక్ పెట్టిన చరణ్ దంపతులు..!

| ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయంగా సత్తా చాటారు. ఆయనకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు వరించింది

By - Tupaki Desk
Update: 2023-08-26 09:45 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయంగా సత్తా చాటారు. ఆయనకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు వరించింది. పుష్ప సినిమాలోని ఆయన నటనకు గాను అందరూ ఫిదా అయిపోయారు. ఫలితంగా ఏకంగా జాతీయ అవార్డు దక్కింది. ఇప్పటి వరకు టాలీవుడ్ సినిమాలకు జాతీయ అవార్డులు వచ్చాయి. కానీ, ఉత్తమ నటుడిగా అవార్డు మొదట వచ్చింది మాత్రం అల్లు అర్జున్ కే కావడం విశేషం. దీంతో, ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

బన్నీకి అభినందనలు తెలపడానికి అందరూ ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. అయితే, అందరూ శుభాకాంక్షలు తెలిపారు. కానీ, రామ్ చరణ్ ఎందుకు చెప్పలేదు అని చాలా మంది అనుకున్నారు. ఎప్పటి నుంచో అల్లు అర్జున్, రామ్ చరణ్ ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని, అందుకే ఇప్పుడు కూడా విషెస్ చెప్పలేదు అంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేశారు. చరణ్ ఒక రోజు ఆలస్యంగా విషెస్ చెప్పడం ఈ రూమర్స్ రావడానికి కారణం అయ్యాయి అయితే, ఆ రూమర్ కి చెక్ పడింది.

తాజాగా చరణ్, ఉపాసనలు ఓ స్పెషల్ గిఫ్ట్ తో అల్లు అర్జున్ కి అభినందనలు తెలియజేశారు. ఓ అందమైన పూల బొకే, దాని మీద స్పెషల్ నోట్ కూడా రాశారు. ఆ స్పెషల్ నోట్ ఉపాసన రాయడం విశేషం. 'డియర్ బన్నీ కంగ్రాంట్స్, నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఇలాంటివి ఇంకా ఎన్నో నిన్ను వరిస్తాయి. అందుకు నీకు అర్హత ఉంది' అంటూ ఆ నోట్ లో పేర్కొన్నారు.

కాగా, ఈ కామెంట్స్, ఆ బొకే చూసి బన్నీ కొంచెం ఎమోషనల్ అయినట్లు సమాచారం. థాంక్యూ సోమచ్, టచ్ చేశారు అంటూ బన్నీ రిప్లై ఇచ్చారు. ఆ బొకే ఫోటోని అల్లు అర్జున్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్టు చేయడం విశేషం. ఈ ఒక్క పోస్ట్ తో వారి మధ్య ఎలాంటి కోల్డ్ వార్ లేనట్లే అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఎంత ఫ్యాన్స్ ఈ విషయంలో సర్ది చెప్పుకున్నా, ఎక్కడో తేడా కొడుతుండడం విశేషం. ఎందుకంటే, ఎన్టీఆర్ విష్ చేసినప్పుడు జెన్యూస్ విషెస్ కి థాంక్యూ బావ అంటూ రిప్లై ఇచ్చి, చరణ్ కి కేవలం థాంక్యూ అని పెట్టడం మెగా ఫ్యాన్స్ ని గందరగోళానికి గురి చేసింది. ఇక, తమ కజిన్స్ అందరిలో సాయిధరమ్ తేజ్ మంచి కజిన్ అంటూ చెప్పడంతో ఈ రూమర్స్ మొదలయ్యాయి.అంతేకాకుండా తాను కట్టే కాలే వరకు చిరు అభిమానిని అంటూనే చరణ్ ని దూరం పెడుతున్నాడనే కామెంట్స్ వినపడుతున్నాయి. మరి చూడాలి..దీనిపై బన్నీ ఎలాంటి క్లారిటీ ఇస్తారో.

Tags:    
  • Ramcharan 
  • Upasanakonidela 
  • Megafamily 
  • Alluarjun 
  • Tollywood 
  • Pushpafilm 
  • Nationalaward 
  • Pushpa2 
  • Bestactor 

Similar News

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

Copyright @2026

Powered by Blink CMS