• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ల‌వ్‌లీ మెగా క‌పుల్ మూగ...

ల‌వ్‌లీ మెగా క‌పుల్ మూగ భాష‌

| మెగాస్టార్ చిరంజీవి వార‌సుడు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఎంత‌గా ఎదిగినా అంత‌గా ఒదిగి ఉండేవాడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

By - Tupaki Desk
Update: 2024-04-17 06:49 GMT

మెగాస్టార్ చిరంజీవి వార‌సుడు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఎంత‌గా ఎదిగినా అంత‌గా ఒదిగి ఉండేవాడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. స్నేహితురాలు ఉపాస‌న‌ను పెళ్లాడి ఇటీవ‌లే ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. క్లిన్ కారా ఈ అద్భుత‌మైన జంట వార‌సురాలు. చ‌ర‌ణ్ ఎల్ల‌పుడూ ఆద‌ర్శ‌నీయ‌మైన భ‌ర్త‌గా, ఫ్యామిలీమ్యాన్ గాను గుర్తింపు తెచ్చుకున్నాడు. చ‌ర‌ణ్- ఉపాస‌న దంప‌తుల అన్యోన్య‌త అన్నివేళ‌లా చ‌ర్చ‌నీయాంశ‌మే. అభిమానులు ఆ ఇద్ద‌రి ఫోటోలు - వీడియోల‌ను షేర్ చేస్తూ త‌మ అభిమానాన్ని చాటుకుంటారు. ఈసారి కూడా అలాంటి ఒక అంద‌మైన వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్‌గా మారింది.

ఈ వీడియోలో మెగా ల‌వ్ లీ క‌పుల్ మూగ‌భాష‌లు అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి. ఒక‌రికొక‌రు దూరంగా ఉన్న ఈ జంట కేవ‌లం హావ‌భావాల‌తోనే క‌మ్యూనికేట్ చేస్తున్న వీడియో నిజంగా క్యూట్ గా ల‌వ్ లీగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్‌గా షేర్ అవుతోంది. ఇది ఇటీవ‌ల చెన్నై వేల్స్ యూనివ‌ర్శిటీ లో డాక్ట‌రేట్ అందుకున్న‌ప్ప‌టి వీడియో. చ‌ర‌ణ్ పూర్తిగా వ‌ర్శిటీ డాక్ట‌రేట్ అందుకునే క్ర‌మంలో విభిన్న‌మైన అవ‌తార్ లో క‌నిపిస్తున్నారు. వేదిక‌పై కూచుని త‌న‌నే గ‌మ‌నిస్తున్న త‌న భార్య ఉపాస‌న‌తో మూగ భాష‌ల్లోనే క‌మ్యూనికేట్ చేస్తూ ల‌వ‌బుల్ గా క‌నిపించారు. ఉపాసన ఏదో గుస‌గుస‌గా చెబుతుంటే ఆ భాష త‌నొక్క‌డికే అర్థ‌మైన‌ట్టుగా చ‌ర‌ణ్ ఎంత బాగా క‌మ్యూనికేట్ చేసారో ఈ వీడియో చూస్తేనే అర్థ‌మ‌వుతోంది. ఆలి మూగ భాష మ‌గ‌నికే ఎరుక అంటారు ఇందుకే.

ఇప్పుడు ఈ వీడియో అభిమానుల్లో వైర‌ల్‌గా మారుతోంది. చ‌ర‌ణ్ ప్ర‌తి అడుగులో ఉపాస‌న ఉన్నారు. అత‌డి ఫ్యాష‌న్ సెన్స్, ఎంపిక‌ల విష‌యంలోను ఉపాస‌న క‌మాండ్ ఉంద‌న్న చ‌ర్చా సాగుతోంది. ముఖ్యంగా శంక‌ర్‌తో గేమ్ ఛేంజ‌ర్ కోసం క‌ఠోరంగా శ్ర‌మిస్తున్న రామ్ చ‌ర‌ణ్‌కి అన్ని విష‌యాల్లో ఉపాస‌న అండ‌గా నిలుస్తున్నారు. ఇక కుటుంబానికి స‌మ‌యం కేటాయించ‌డం కోసం చ‌ర‌ణ్ రాజీ లేని ప్లానింగ్, ఉపాస‌న‌తో అన‌న్యోన్య‌త.. క‌పుల్ గోల్స్.. అన్నివేళ‌లా అభిమానుల్లో స్ఫూర్తిని నింపుతున్నాయి.

Best Couple @AlwaysRamCharan @upasanakonidela 🥹🫶❤️ pic.twitter.com/JFPwmu6KEm

— 𝓢𝔀𝓮𝓮𝓽𝔂 𝓑𝓪𝓫𝓾𝓖𝓸𝓾𝓭 ᴿᶜ (@RC_MSD_) April 16, 2024
Tags:    
  • Ramcharan 
  • Upasana 
  • Filmindustry 
  • Megafamily 
  • Doctorate 
  • Velsuniversitychennai 
  • Klinkaarakonidela 
  • Gamechanger 
  • Ramcharandoctorate 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS