మాహేష్ కారణంగా హృతిక్ రిజెక్ట్ చేశాడా?

మహేష్ కు కూడా ఇంట్రెస్ట్ ఉన్నా.. ఆయన రాజమౌళి మూవీతో బిజీ గా ఉండడం వల్ల రామాయణ ప్రాజెక్ట్ ను వదులుకున్నారని ఇప్పుడు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నారు.;

Update: 2025-07-18 16:30 GMT

రామాయణం ఆధారంగా బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా రామాయణ్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. దంగల్ ఫేమ్ నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా కనిపించనున్నాడు. సీతమ్మగా సాయి పల్లవి, రావణుడిగా రాకింగ్ స్టార్ యశ్ యాక్ట్ చేస్తున్నారు.

మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న రామాయణ్ ను నిర్మాత నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. హీరో యష్ కూడా సినిమా నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. ఇప్పటికే రామయాణ్ మొదటి భాగం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా గ్లింప్స్ ను రిలీజ్ చేయగా.. ఊహించని రెస్పాన్స్ వస్తోంది.

వీఎఫ్‌ ఎక్స్ వర్క్స్ ఓ రేంజ్ లో ఉన్నాయని ప్రశంసలు వచ్చాయి. అయితే ఇప్పుడు రామాయణ్ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త నెట్టింట బాగా వైరలవుతోంది. సినిమాలో ముందు రాముడి పాత్ర కోసం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును మేకర్స్ అనుకున్నారట. నితేష్ తివారీ కూడా మొద‌ట మ‌హేష్ కావాల‌ని ప‌ట్టుబ‌ట్టారట.

మహేష్ కు కూడా ఇంట్రెస్ట్ ఉన్నా.. ఆయన రాజమౌళి మూవీతో బిజీ గా ఉండడం వల్ల రామాయణ ప్రాజెక్ట్ ను వదులుకున్నారని ఇప్పుడు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నారు. అదే సమయంలో మహేష్ ఓకే చెబితే.. తాను రావణుడిగా నటించేందుకు బీ టౌన్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది.

కానీ మహేష్ ఓకే చెప్పకపోవడంతో.. హృతిక్ కూడా నో చెప్పారని తెలుస్తోంది. ఇందులో నిజమెంతో మాత్రం తెలియదు. అయితే హృతిక్ నిర్ణయం వృత్తిపరమైన అంశాల నేపథ్యంలో ఉందని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. మెయిన్ లీడ్స్ పోషించే ఆయన.. ఇప్పుడు విలన్ రోల్ లో చేయడానికి ఇష్టం లేక చెప్పుంటారని అంటున్నారు.

అయితే రీసెంట్ గా.. రణబీర్ ను ఎందుకు రాముడిగా సెలెక్ట్ చేశామో మేకర్స్ వెల్లడించారు. ఆయన ప్రశాంతమైన వ్యక్తిత్వం, నటనా నైపుణ్యం కారణాలుగా చెప్పారు. అలా రాముడి పాత్రకు ఆయన సరిపోతాడనే నమ్మకం ఆధారంగా చిత్రనిర్మాతలు ఎంపిక చేసుకున్నారు. 2026 దీపావళికి తొలి భాగం రిలీజ్ అవ్వనుంది.

Tags:    

Similar News