ముందే రావ‌డం రామాయ‌ణానికి మంచిదా?

`రామాయ‌ణ్`-`వార‌ణాసి` చిత్రాలిప్పుడు ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులుగా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు చిత్రాల పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.;

Update: 2026-04-06 03:30 GMT

`రామాయ‌ణ్`-`వార‌ణాసి` చిత్రాలిప్పుడు ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులుగా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు చిత్రాల పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే రాజమౌళి సినిమా కంటే ముందే నితేష్ తివారీ `రామాయణ` పార్ట్ 1 విడుదల కావ‌డం ఆ చిత్రానికి వ్యాపార పరంగా, ప్రేక్షకుల ఆదరణ పరంగా పెద్ద అడ్వాంటేజ్ అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజమౌళి సినిమా గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా అత్యున్నత సాంకేతిక విలువల తో రాబోతోంది. రాజమౌళి ఒకసారి విజువల్ స్టాండర్డ్స్ సెట్ చేశాక ఆ తర్వాత వచ్చే సినిమాలను ప్రేక్షకులు అదే స్థాయిలో పోల్చి చూస్తారు.

`రామాయణ` సినిమా రాజమౌళి ప్రాజెక్ట్ కంటే ముందే రావడం వల్ల ఎటువంటి భారీ పోలికల ఒత్తిడి లేకుండా తనదైన శైలిలో ప్రేక్షకులను మాయ చేసే అవకాశం నితేష్ తివారీకి ఉంటుంది. ఇది సినిమాకు ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ను ఇస్తుందన‌డంలో సందేహం లేదు. రాజమౌళి సినిమా విడుదలవుతుందంటే? ప్రపంచవ్యాప్తంగా థియేటర్లన్నీ ఆ సినిమాకే కేటాయించాల్సి ఉంటుంది. ఒకవేళ రెండు సినిమాలు దగ్గరి వ్యవధిలో రిలీజ్ అయితే థియేటర్ల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. కానీ నితేష్ తివారీ సినిమా ముందే రావడం వ‌ల్ల ఉత్తరాదితో పాటు దక్షిణాదిలో కూడా పెద్ద‌ సంఖ్యలో స్క్రీన్లను దక్కించుకోవచ్చు.

ఇది సినిమా ఓపెనింగ్స్ , లాంగ్ రన్ వసూళ్లకు ప్లస్ అవుతుంది. హిట్ టాక్ తెచ్చుకుంటే? బాక్సాఫీస్ వద్ద స‌రికొత్త రికార్డులు న‌మోదవుతాయి. అదే జ‌రిగితే రామాయ‌ణ‌మే `వార‌ణాసి`కి బాక్సాఫీస్ టార్గెట్ ఫిక్స్ చేసిన‌ట్లు అవుతుంది.

రామాయ‌ణానికి బిజినెస్ ప‌రంగా పాన్ ఇండియాలో ఎంతో క‌లిసొస్తుంది. భారీ రేట్లకు డిజిటల్ ,శాటిలైట్ హక్కులు అమ్ముడయ్యే అవకాశం ఉంది. సాధారణంగా పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ ఉంటే ఇన్వెస్టర్లు బడ్జెట్ విషయంలో ఆలోచనలో పడతారు. కానీ రామాయణం ముందుగా రావడం వల్ల ట్రేడ్ పరంగా సేఫ్ జోన్ లో ఉంటుంది.

అలాగే గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో కూడా ఎటువంటి పోటీ లేకుండా సినిమాను ప్రమోట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ -బాలీవుడ్‌లో పౌరాణిక, ఆధ్యాత్మిక చిత్రాలకు ఆదరణ పెరిగింది. వార‌ణాసి సినిమా ఇంటర్నేషనల్ అడ్వెంచర్ కావడంతో అది వేరే జోనర్ లో ఉంటుంది. రామాయణం వంటి భక్తితో కూడిన కావ్యం ముందే రావడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు భారీగా తరలివస్తారు. రాజమౌళి సినిమా వచ్చే లోపు ప్రేక్షకులు ఒక విజువల్ వండర్‌ను చూసి సంతృప్తి చెందుతారు. కాబట్టి రామాయణం మార్కును స్పష్టంగా వేయగలుగుతుంది.

రాజమౌళిని ఇండియన్ జేమ్స్ కామెరూన్ గా పిలుస్తారు. ఆయన సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ సినిమా వచ్చినా సాంకేతికంగా రాజమౌళితో పోల్చడం సహజం. నితేష్ తివారీ సినిమా ముందే రావడం వల్ల అటువంటి కఠినమైన పోలికల నుండి తప్పించుకోవచ్చు. తనదైన శైలిలో రామాయణాన్ని ఆవిష్కరించే స్వేచ్ఛ నితేష్‌కు ఉంటుంది.

Tags:    

Similar News