• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'రామాయ‌ణం' మార్కెట్ పెంచే...

'రామాయ‌ణం' మార్కెట్ పెంచే వ్యూహం

| మే 1 నుంచి 4 వ‌ర‌కూ జ‌ర‌గ‌నున్న వరల్డ్ ఆడియో విజువల్ & ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES)లో రామాయణం ఫ‌స్ట్ లుక్ ని రిలీజ్ చేయాల‌ని మేకర్స్ ఆలోచిస్తున్నారని తెలిసింది.

By - Tupaki Desk
Update: 2025-04-27 05:45 GMT

యానిమల్ చిత్రం పాన్ ఇండియ‌న్ స్టార్ డ‌మ్ ని అందించిన త‌ర్వాత‌ రణబీర్ కపూర్ ప్ర‌ణాళిక‌లు అమాంతం మారాయి. అత‌డు తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రామాయణంలో న‌టిస్తున్నాడు. దంగల్, చిచ్చోర్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్ని అందించిన నితేష్ తివారీ ఈ ఫ్రాంఛైజీకి దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సిరీస్ ని అత్యంత భారీ బ‌డ్జెట్ తో రూపొందించ‌నున్నామ‌ని ద‌ర్శ‌కనిర్మాత‌లు ప్ర‌క‌టించారు. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుండ‌గా, మొదటి భాగం 2026 దీపావళికి, రెండవ భాగం 2027 దీపావళికి విడుద‌ల‌వుతాయి.

 

పాత్ర‌లు, పాత్ర‌ధారుల ఎంపిక ఎంతో ఆస‌క్తిని రేకెత్తించింది. శ్రీ‌రాముడిగా రణబీర్ , సీతగా సాయిప‌ల్ల‌వి నటిస్తుండ‌గా, కీల‌క‌మైన పాత్ర‌ల్లో స‌న్నీడియోల్, బాబి డియోల్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. అభిమానులు ఫస్ట్ లుక్ కోసం వేచి చూస్తున్న ఈ ప్ర‌త్యేక త‌రుణంలో ఒక శుభ‌వార్త అందింది.

మే 1 నుంచి 4 వ‌ర‌కూ జ‌ర‌గ‌నున్న వరల్డ్ ఆడియో విజువల్ & ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES)లో రామాయణం ఫ‌స్ట్ లుక్ ని రిలీజ్ చేయాల‌ని మేకర్స్ ఆలోచిస్తున్నారని తెలిసింది. ది వేవ్స్ స‌మ్మిట్ -2025 దేశంలో ఇదే తొలిసారి. దేశ‌వ్యాప్తంగా ఉన్న సినీప్ర‌ముఖులంతా ఈ ఈవెంట్ కి అటెండ‌వుతున్నారు. అలాంటి చోట రామాయ‌ణం గ్లింప్స్ రిలీజ్ చేయాల‌నేది స‌రైన ఆలోచ‌న‌. దీనిని నితీష్ తివారీ నిర‌భ్యంత‌రంగా అమ‌ల్లో పెడుతున్నారు. రామాయ‌ణం -1 మొదటి పోస్టర్ లేదా వీడియోను విడుదల చేయాలనేది ప్లాన్. ప్ర‌స్తుతం దీనిపై చిత్ర‌బృందం సీరియ‌స్ గా వ‌ర్క్ చేస్తోంద‌ని స‌మాచారం. వేవ్స్ వేదిక‌గా రామాయ‌ణం టీమ్ గ్రాండ్ ప్రమోషన్స్ ని ప్రారంభించే యోచ‌న‌తో ఉంది.

రాకింగ్ స్టార్ యష్‌ ఈ చిత్రంలో రాక్షస రాజు రావణుడిగా న‌టిస్తుండ‌గా, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. అరుణ్ గోవిల్, లారా దత్, ఇందిరా కృష్ణ, మరియు రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు.

Tags:    
  • RamayanaMovie 
  • RanbirKapoor 
  • SaiPallavi 
  • NiteshTiwari 
  • RamayanaFirstLook 
  • RamayanaTeaser 
  • RamayanaFilm 
  • Ramayana2026 
  • Diwali2026Release 

Similar News

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

Copyright @2026

Powered by Blink CMS