‘రామాయణ’కి తుది మెరుగులు ఏంటో తెలుసా?
ముఖ్యంగా రణబీర్ కపూర్ పోషించిన రాముడి పాత్రతో పాటు యశ్ పోషించిన రావణుడి పాత్రకు సంబంధించి వీఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ ‘రామాయణ’ విడుదలకు ముహూర్తం సమీపిస్తున్న విషయం తెల్సిందే. దీపావళి సందర్భంగా నవంబర్ 6, 2026న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో దర్శకుడు నితేష్ తివారీ ఎక్కువ శ్రద్ధ పెట్టాడని బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. రామాయణ సినిమాలో గ్రాఫిక్స్ కి ఉండే ప్రాధాన్యం చాలా ఎక్కువ, కనుక దర్శకుడు నితేష్ తివారీ బడ్జెట్లో సింహ భాగం ను వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం కేటాయించాడు అంటూ సమాచారం అందుతోంది. సినిమాలోని ప్రతి పాత్ర విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా రణబీర్ కపూర్ పోషించిన రాముడి పాత్రతో పాటు యశ్ పోషించిన రావణుడి పాత్రకు సంబంధించి వీఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రభాస్, రాజమౌళి బాహుబలి తర్వాత...
బాహుబలి సినిమా తర్వాత బాలీవుడ్ తో పాటు, అన్ని భాషల్లో వచ్చిన, వస్తున్న భారీ బడ్జెట్ సినిమాల్లో గ్రాఫిక్స్ వర్క్ విషయంలో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్ వర్క్ ను సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు. అందుకే నితేష్ తివారీ హీరోతో పాటు ముఖ్య పాత్రలకు సంబంధించిన సన్నివేశాల గ్రాఫిక్స్ వర్క్ పై శ్రద్ధ ఎక్కువ పెట్టాడని సినిమా కోసం వర్క్ చేసిన వారు ఆఫ్ ది రికార్డ్ అంటున్నారు. సాధారణంగానే రామాయణ సినిమా అంటే గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువ ఉంటుంది. అలాంటిది దర్శకుడు నితేష్ తివారీ ఎక్కువ శ్రద్ధ పెట్టాడంటే ఏ స్థాయిలో ఖర్చు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సినిమా రెండు పార్ట్స్ కి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ కోసం హాలీవుడ్ సినిమాలకు వర్క్ చేసిన వారు వందలాది మంది వినియోగించబడుతున్నారట. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా గ్రాఫిక్స్ ఉండబోతున్నాయి.
రణబీర్ కపూర్, సాయి పల్లవి ల ‘రామాయణ’
రణబీర్ కపూర్ యొక్క లుక్ విషయంలో ఉన్న విమర్శలు తీసుకుని చివరి నిమిషంలో ఆ పాత్ర కనిపించే షాట్స్ ను మరోసారి వీఎఫ్ఎక్స్ టీంకు అప్పగించారని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు కూడా రామాయణ సినిమా కోసం వందలాది మంది పగలు, రాత్రి తేడా లేకుండా కష్టపడుతున్నారట. పలు కంపెనీలు ఈ సినిమా కోసం తమ స్టాఫ్ మొత్తాన్ని కేటాయించారని తెలుస్తోంది. సినిమాను అనుకున్న సమయంకు ఇవ్వాలనే ఉద్దేశంతో దర్శకుడు నితేష్ తివారీ ఎక్కువ శ్రద్ద తీసుకుంటున్నాడు. షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి గ్రాఫిక్స్ వర్క్ సైతం మొదలు పెట్టడం ద్వారా ఇప్పుడు ఎక్కువ హైరానా పడాల్సిన అవసరం రావడం లేదట. సినిమాను ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న సమయం కు దీపావళి కానుకగా విడుదల చేయడం లక్ష్యంగా వర్క్ జరుగుతోంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సైతం మొదలు అయ్యిందనే వార్తలు వస్తున్నాయి.
రావణుడిగా యశ్ నటిస్తున్న రామాయణ..
రాముడి పాత్రలో రణబీర్ కపూర్ ను ఇప్పటికే టీజర్, పోస్టర్లలో చూసిన వారు సూపర్ అంటూ కితాబిస్తున్నారు. మరో వైపు సీతాదేవి పాత్రలో సాయి పల్లవి నటిస్తున్న నేపథ్యంలో సౌత్ ఇండియన్ ప్రేక్షకులు ఎప్పుడు ఎప్పుడు సినిమా వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కన్నడ స్టార్ యశ్ ను రావణుడిగా చూడబోతున్నాం. రామాయణ రెండు లేదా మూడు పార్ట్ లు గా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అన్ని పార్ట్లకు కలిపి సినిమా కోసం నిర్మాతలు దాదాపుగా రూ.4 వేల కోట్లను ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మేకింగ్, వీఎఫ్ఎక్స్ వర్క్, ప్రమోషన్ ఇలా అన్ని విధాలుగా కలుపుకుని రెండు పార్ట్ లకు గాను రూ.4 వేల కోట్లు ఖర్చు కానుందట. సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో భారీ వసూళ్లు రావడం ఖాయం. ఏకంగా హాలీవుడ్ లోనూ ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. రెండు పార్ట్ లు కలిపి అన్ని రకాలుగా సినిమా మేకర్స్ కి వేల కోట్లను తెచ్చి పెట్టడం ఖాయం అని బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు.