బేబీ బంప్‌తో సమంత.. ఇప్పుడు ఫుల్ ఫ్యామిలీ టైమ్

సమంత మళ్ళీ చాలా రోజుల తరువాత కొన్ని స్పెషల్ మూమెంట్స్ తో ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు. కొత్తగా షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Update: 2026-08-30 11:28 GMT

సమంత మళ్ళీ చాలా రోజుల తరువాత కొన్ని స్పెషల్ మూమెంట్స్ తో ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు. కొత్తగా షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈసారి పెద్ద ఫొటోషూట్ ఏమీ కాదు. ఇంట్లో రిలాక్స్ అవుతూ, కాఫీ తాగుతూ, ప్రయాణంలో ఉన్న కొన్ని ఫొటోలను ఒకే పోస్టులో పెట్టింది. అందులో బేబీ బంప్ కూడా కనిపిస్తోంది.



 


జూన్‌లోనే తాను ప్రెగ్నెంట్ అని సమంత అధికారికంగా చెప్పింది. ప్రస్తుతం ఆమె మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తోంది. సమంత గత ఏడాది డిసెంబర్ 1న దర్శకుడు రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకుంది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో అతి కొద్దిమంది మధ్య వీరి వివాహం జరిగింది. ఇప్పుడు ఇద్దరూ తమ మొదటి బిడ్డను ఆహ్వానించబోతున్నారు.



 


ఇటీవల సమంత తన ప్రెగ్నెన్సీ వర్కౌట్స్, ట్రావెల్ ఫొటోలు కూడా షేర్ చేస్తోంది. రాజ్‌తో కలిసి వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలు కూడా గతంలో బయటకు వచ్చాయి. సినిమాల విషయానికి వస్తే సమంత చివరిగా ‘మా ఇంటి బంగారం’తో థియేటర్లలో కనిపించింది. నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ట్రేడ్ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.100 కోట్ల గ్రాస్ దగ్గరకు వెళ్లింది.



 


చాలా గ్యాప్ తర్వాత సమంతకు తెలుగులో వచ్చిన థియేట్రికల్ రిలీజ్ ఇదే. పైగా ఈ సినిమాలో లీడ్ రోల్‌తో పాటు నిర్మాతగానూ ఆమె భాగమైంది. ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ లో రాజ్ నిడిమోరు కూడా ఉన్నాడు. కథను రూపొందించడంతో పాటు నిర్మాతగా పని చేశాడు. సమంతకు సరిపోయేలా ఆ పాత్రను డిజైన్ చేసినట్లు రాజ్ అప్పట్లో చెప్పాడు.



 


సమంత కూడా ఈ సినిమా తర్వాత కొంతకాలం మెటర్నిటీ బ్రేక్ తీసుకుంటానని ప్రకటించింది. అయితే సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పడం లేదని, తిరిగి వచ్చినప్పుడు పెద్ద ప్రాజెక్ట్ చేయాలని ఉందని చెప్పింది. బ్రేక్ ప్రకటించిన కొద్ది రోజులకే సమంత మరో అప్డేట్ ఇచ్చింది. సోనీ లివ్ తమిళ్‌తో కలిసి ఒక కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నట్లు జూలైలో ప్రకటించింది. అది సినిమా అవుతుందా లేక సిరీస్ అవుతుందా అన్న వివరాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.



 


చాలా కాలం తర్వాత ఆమె తమిళంలో చేస్తున్న కొత్త ప్రాజెక్ట్ ఇదే కావచ్చు. ప్రస్తుతం షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందన్న క్లారిటీ కూడా లేదు. ఇక ‘మా ఇంటి బంగారం’ కథ కూడా అక్కడితో ఫినిష్ లేదు. అదే టీమ్‌తో రెండో భాగం చేస్తామని రాజ్ ఇప్పటికే ప్రకటించాడు. దాదాపు రెండేళ్ల తర్వాత ఆ సినిమా ఉండొచ్చని చెప్పాడు. ప్రస్తుతం మాత్రం సమంత ఆరోగ్యం విషయం చాలా జాగ్రత్తలు తీసుకొంటోంది. ఇక సినిమాల్లో మళ్లీ ఎప్పుడు కనిపిస్తుందో చెప్పలేదు కానీ, ఆమె ఎంట్రీ ఇస్తే మాత్రం జెట్ స్పీడ్ లోనే బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్టులు వస్తాయని చెప్పవచ్చు.

Tags:    

Similar News