థియేటర్లలో దుమ్మురేపిన ఇరుముడి.. OTTలోనూ అదే మ్యాజిక్ సాధ్యమేనా?

ఒక సినిమా థియేటర్లలో స‌క్సెస్ అవ‌డం ఒక ఎత్తయితే.. అదే సినిమాకు ఓటీటీ ప్లాట్‌ఫామ్ పై ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్నది ఇప్పుడు మరో కీలక అంశంగా మారింది.

Update: 2026-08-30 08:12 GMT

ఒక సినిమా థియేటర్లలో స‌క్సెస్ అవ‌డం ఒక ఎత్తయితే.. అదే సినిమాకు ఓటీటీ ప్లాట్‌ఫామ్ పై ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్నది ఇప్పుడు మరో కీలక అంశంగా మారింది. ముఖ్యంగా బాక్సాఫీస్ వద్ద మంచి క‌లెక్ష‌న్లు సాధించిన సినిమాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చినప్పుడు వాటిని థియేటర్లలో మిస్ అయిన ఆడియ‌న్స్‌తో పాటు ఇప్పటికే చూసిన ఆడియన్స్ కూడా మరోసారి చూస్తారా? అన్న ఆసక్తి నెలకొంటోంది. ప్రస్తుతం రవితేజ నటించిన ఇరుముడి విషయంలోనూ ఇదే డిస్క‌ష‌న్ మొదలైంది.

శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటూ తన బాక్సాఫీస్ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. సెకండ్ వీక్ లోనూ క‌లెక్ష‌న్ల‌లో ఊపును కొనసాగించడం సినిమాకు ఉన్న డిమాండ్‌ను సూచిస్తోంది. ముఖ్యంగా తెలుగు మార్కెట్‌లో సినిమాకు వస్తున్న రెస్పాన్స్, మౌత్ టాక్ కారణంగా థియేట్రికల్ రన్‌పై ఆసక్తి కొనసాగుతోంది.

ఇలాంటి టైమ్‌లో ఇరుముడి డిజిటల్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్‌కు వెళ్లడం సహజంగానే మరో డిస్క‌ష‌న్‌కు దారితీసింది. ప్రస్తుత సమాచారం ప్రకారం నాలుగు వారాల థియేట్రికల్ విండో త‌ర్వాత ఇరుముడి సినిమా సెప్టెంబర్ 18 నుంచి స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ డేట్‌పై నెట్‌ఫ్లిక్స్ లేదా మేక‌ర్స్ నుంచి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

థియేటర్లలో ఇంకా సినిమా స‌క్సెస్‌ఫుల్ గా ర‌న్ అవుతున్న టైమ్ లోనే ఓటీటీ రిలీజ్‌పై డిస్క‌ష‌న్ మొద‌ల‌వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. గతంలో థియేట్రికల్ రన్ పూర్తయ్యే వరకు డిజిటల్ రిలీజ్ గురించి పెద్దగా డిస్క‌ష‌న్ ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం థియేటర్ క‌లెక్ష‌న్లు, ఓటీటీ రైట్స్, స్ట్రీమింగ్ టైమింగ్ కూడా ఒక సినిమా స‌క్సెస్ ను అంచనా వేసే అంశాలుగా మారుతున్నాయి.

అయితే ఇరుముడికి అసలు పరీక్ష ఓటీటీలోనే ఉండనుంది. థియేటర్లలో చూసిన ఆడియ‌న్స్ మళ్లీ ఈ ఎమోషనల్ డ్రామాను చూడటానికి ఆసక్తి చూపుతారా? ఫ్యామిలీ ఆడియ‌న్స్, థియేట‌ర్ల‌లో మిస్ అయిన ఆడియన్స్ డిజిటల్ రిలీజ్‌ను ఎంతవరకు ఆదరిస్తారు? ఇతర భాషల ఆడియ‌న్స్ కు ఇరుముడి సినిమా ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా చూస్తే థియేటర్లలో స‌క్సెస్ ను అందుకున్న సినిమాకు ఓటీటీ ఇప్పుడు కేవలం మరో రిలీజ్ ప్లాట్‌ఫామ్ మాత్రమే కాకుండా, అది సినిమాకు మ‌రో ప్రేక్షక‌వర్గాన్ని సృష్టించే వేదికగా మారింది. ఈ నేపథ్యంలో ఇరుముడి థియేట్రికల్ సక్సెస్‌ను డిజిటల్ స్క్రీన్‌పై ఎంతవరకు కొనసాగిస్తుందో చూడాలి.

Tags:    

Similar News