‘టాక్సిక్’పై కన్నడ స్టార్స్ రియాక్షన్స్.. ఏమన్నారంటే..
ఈ టైమ్‌లో కన్నడ ఇండస్ట్రీ నుంచి మాత్రం యష్, గీతూ చేసిన ప్రయత్నంపై వరుసగా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఉపేంద్ర, కిచ్చా సుదీప్, రిషబ్ శెట్టి లాంటి స్టార్స్ సినిమా చూసి తమకు నచ్చిన విషయాల గురించి పాజిటివ్ రియాక్ట్ అయ్యారు.
యష్ హీరోగా గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ ఆగస్టు 26న థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్ తర్వాత సినిమా గురించి సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ టైమ్‌లో కన్నడ ఇండస్ట్రీ నుంచి మాత్రం యష్, గీతూ చేసిన ప్రయత్నంపై వరుసగా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఉపేంద్ర, కిచ్చా సుదీప్, రిషబ్ శెట్టి లాంటి స్టార్స్ సినిమా చూసి తమకు నచ్చిన విషయాల గురించి పాజిటివ్ రియాక్ట్ అయ్యారు.
ఉపేంద్రకు ‘టాక్సిక్’ పూర్తిగా కొత్త ప్రపంచంలా అనిపించిందట. సినిమా చూస్తున్నంతసేపు కొత్త అనుభవం కలిగిందని చెప్పిన ఆయన, నటీనటులతో పాటు టెక్నీషియన్స్ పడిన కష్టాన్ని మెచ్చుకున్నారు. యష్‌తో పాటు మొత్తం టీమ్‌కు హ్యాట్సాఫ్ అంటూ తన రెస్పాన్స్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
సుదీప్ మాత్రం యష్ తీసుకున్న నిర్ణయం గురించి ఎక్కువగా మాట్లాడారు. ‘కేజీఎఫ్ 2’ తర్వాత మళ్లీ అదే తరహా రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేయడం సులభమని, కానీ యష్ అలా వెళ్లకుండా కొత్త దారిని ఎంచుకున్నాడని చెప్పారు. ఇలాంటి ప్రయత్నానికి నమ్మకం, ధైర్యం కావాలని పేర్కొన్నారు. సినిమాలో మాట్లాడుకోవడానికి, ఆలోచించడానికి కొన్ని పార్ట్స్ ఉన్నాయని కూడా సుదీప్ తన పోస్టులో రాశారు.
రిషబ్ శెట్టి యష్ పాత్రకే ఎక్కువ మార్కులు ఇచ్చారు. బయటకు పవర్‌ఫుల్‌గా కనిపించే వ్యక్తిలో గిల్ట్ ఎలా పెరుగుతుందనే విషయాన్ని యష్ బాగా చూపించాడని అన్నారు. కథ, పాత్రలు రెగ్యులర్ దారిలో వెళ్లకపోయినా అది తప్పు కాదని చెప్పారు. కన్నడ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లాలనే యష్ ప్రయత్నానికి తాను అండగా ఉంటానని కూడా రిషబ్ పేర్కొన్నారు.
రక్షిత ప్రేమ్ కూడా యష్ నటుడిగా తనను తాను మార్చుకున్న విధానాన్ని మెచ్చుకున్నారు. అషికా రంగనాథ్ సినిమాలోని గిల్ట్, ట్రామా, రిగ్రెట్ కోణాల గురించి మాట్లాడారు. సాన్వి సుదీప్ యష్ నటన సినిమా పూర్తయ్యాక కూడా గుర్తుండిపోయేలా ఉందని చెప్పారు. సింగర్ విజయ్ ప్రకాష్ మాత్రం గ్యాంగ్ వార్ నేపథ్యంలో మనుషుల ఎమోషన్స్ తో నడిచే సినిమాగా ఉందని అన్నారు.
ఈ కామెంట్స్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు యష్‌తో పాటు గీతూ మోహన్‌దాస్‌దే. ‘కేజీఎఫ్’ తర్వాత యష్ నుంచి ఎలాంటి సినిమా వస్తుందో ముందే ఒక అంచనా ఉండగా, దానికి భిన్నమైన పాత్ర, కథా ప్రపంచాన్ని తీసుకున్నారని సుదీప్, రిషబ్ ఇద్దరూ తమ పోస్టుల్లో ప్రస్తావించారు. అందుకే సినిమా ఫలితం గురించి తీర్పులాగా చెప్పలేదు. ముఖ్యంగా ఆ ప్రయత్నంపైనే కన్నడ సినీ ప్రముఖుల పాజిటివ్ గా మాట్లాడుతున్నారు.
ఇక వసూళ్ల విషయానికి వస్తే చిత్రబృందం చెబుతున్న లెక్కల ప్రకారం హిందీ వెర్షన్ నాలుగు రోజుల్లో రూ.112 కోట్ల నెట్ దాటింది. మరోవైపు ట్రాకింగ్ రిపోర్ట్స్ నాలుగో రోజు వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.254 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్లు చెబుతున్నాయి. యష్‌తో పాటు నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి నటించిన ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది. ఇక వీకెండ్ అనంతరం కలెక్షన్స్ ఇంకా ఎలా ఉంటాయో చూడాలి.