దేవర అప్‌డేట్‌.. సెకండ్‌ సూపర్‌ రొమాంటిక్‌!

ఎన్టీఆర్‌ పాన్ ఇండియా మూవీ 'దేవర' నుంచి మొదటి పాటను మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి.

Update: 2024-05-18 06:29 GMT

ఎన్టీఆర్‌ పాన్ ఇండియా మూవీ 'దేవర' నుంచి మొదటి పాటను మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి. అనిరుధ్‌ సంగీత సారధ్యంలో రూపొందిన మొదటి పాటకు సంబంధించిన ప్రోమో అందరి దృష్టిని ఆకర్షించి, ఎప్పుడెప్పుడు పూర్తి పాట వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

దేవర పై అంచనాలు పెంచే విధంగా పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి సోషల్‌ మీడియా లో భయం పాట కచ్చితంగా ఫ్యాన్స్ అంచనాలను అందుకుంటుంది. అంతే కాకుండా ఎదురు చూపులకు తగిన ఫలితం ను ఇస్తుందని చెప్పుకొచ్చారు. అనిరుధ్‌ తన ట్యూన్స్‌ తో అదరగొట్టాడు. ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వడం ఖాయం అన్నారు.

అదే సమయంలో దేవర సెకండ్‌ పాటకు సంబంధించిన అప్‌డేట్ ను కూడా రామ జోగయ్య శాస్త్రి నుంచి వచ్చింది. ప్రస్తుతం తాను సెకండ్‌ సింగిల్ రికార్డింగ్‌ కోసం చెన్నై వచ్చాను. రెండో పాట రొమాంటిక్ నెంబర్‌ గా రానుందని శాస్త్రి గారు చెప్పుకొచ్చారు. రొమాంటిక్ సాంగ్‌ తో దేవర స్థాయి మరింతగా పెరగడం ఖాయంగా తెలుస్తోంది.

ఎన్టీఆర్‌ కు జోడీగా ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెల్సిందే. అయిదు సంవత్సరాలుగా జాన్వీ కపూర్ టాలీవుడ్‌ ఎంట్రీ కోసం శ్రీదేవి ఫ్యాన్స్ మరియు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.

Read more!

ఎట్టకేలకు కొరటాల శివ దేవర కోసం జాన్వీ కపూర్ ను ఒప్పించాడు. ఎన్టీఆర్ మరియు జాన్వీ కపూర్ ల రొమాంటిక్ నెంబర్ ఎలా ఉంటుందా అంటూ కూడా చాలా ఆసక్తిగా అంతా ఎదురు చూస్తున్న సమయంలో శాస్త్రి గారు ఇచ్చిన సెకండ్‌ సూపర్‌ రొమాంటిక్ నెంబర్‌ పై మరింత అంచనాలు పెరిగాయి.

రెండు పార్ట్‌ లుగా రాబోతున్న దేవర సినిమాకు సంబంధించిన మొదటి పార్ట్‌ షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. అక్టోబర్‌ నెలలో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దేవర సినిమా పాన్‌ ఇండియా రేంజ్ లో భారీగా వసూళ్లు నమోదు చేయడం ఖాయం అంటూ ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News