ఫ్యాన్స్ ప్రేమకు అర్థం అదే.. 'ఆంధ్రా కింగ్ తాలూకా'పై రామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

"ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూనే ఉన్నాను. ఈ సినిమా ఆ క్వశ్చన్‌కు ఆన్సర్ ఇస్తుందని నమ్ముతున్నాను.;

Update: 2025-11-09 07:30 GMT

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన అప్ కమింగ్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా' ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా నవంబర్ 28న రిలీజ్‌కు రెడీ అవుతుండటంతో, రామ్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో, రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు.. 'ఫ్యాన్స్' అనే కాన్సెప్ట్ గురించి రామ్ చాలా లోతుగా, ఇంట్రెస్టింగ్‌గా మాట్లాడాడు.

ఇంటర్వ్యూలో యాంకర్.. "తెలుగు అభిమానులది పిచ్చి ప్రేమ. టీజర్‌లో మీరు రామ్‌లా కాకుండా, ఒక వీరాభిమానిలా కనిపించారు. ఆ పాత్రలోకి వెళ్లడానికి ఎలాంటి హోంవర్క్ చేశారు?" అని ప్రశ్నించారు. దీనికి రామ్ చాలా బ్యూటిఫుల్‌గా ఆన్సర్ ఇచ్చాడు. "ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, కథ విన్నాక ఆ క్యారెక్టర్ కోసం హోంవర్క్ చేయడం. రెండోది, మన మైండ్‌లో ఎప్పటినుంచో నడుస్తున్న ఒక ఆలోచనకు.. ఆన్సర్ ఇచ్చేలా ఒక కథ దొరకడం. ఈ సినిమా రెండో రకం" అని రామ్ చెప్పాడు.

ఫ్యాన్స్ గురించి వివరిస్తూ.. "ఒక స్టార్‌కి, ఫ్యాన్‌కి మధ్య ఉండే ఆ బాండ్ బయటివాళ్లకు ఎప్పటికీ అర్థం కాదు. నాకు ఎప్పుడూ ఆ క్వశ్చన్ ఉండేది. అసలు ఏ సంబంధం లేని బంధం ఇది. వాళ్లను ఎప్పుడూ కలవలేదు, కానీ ఎప్పటినుంచో తెలిసిన ఫీలింగ్ ఉంటుంది. వాళ్ల కోసం మనం ఏం చేశాం? వాట్ ఇస్ దట్ బాండ్?" అని రామ్ అన్నాడు.

"ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూనే ఉన్నాను. ఈ సినిమా ఆ క్వశ్చన్‌కు ఆన్సర్ ఇస్తుందని నమ్ముతున్నాను. ఆ ఎమోషన్‌ను, ఆ రిలేషన్‌ను ఈ సినిమా చాలా బ్యూటిఫుల్‌గా చూపించబోతోంది" అని రామ్ తెలిపాడు. ఇంతకుముందు ఫ్యాన్ బేస్డ్ సినిమాలు వచ్చినా, అవి వేరేలా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు.

"ఇప్పటిదాకా ఫ్యాన్ గురించి వచ్చిన సినిమాల్లో.. ఆ రిలేషన్‌షిప్‌ను ఎవరూ సరిగ్గా ఎక్స్‌ప్లోర్ చేయలేదు. ఎక్కడో ఫ్యాన్‌ను విలన్‌గా చూపించారు, లేదంటే ఫ్రెండ్‌షిప్‌గా చూపించారు. కానీ, ఒక స్టార్‌కి, ఫ్యాన్‌కి మధ్య ఉండే ఆ 'ప్యూర్ రిలేషన్' గురించి ఎవరూ చెప్పలేదు. అది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ రిలేషన్, కానీ చాలా మందికి అది అర్థం కాదు" అని రామ్ అన్నాడు.

ఆ ప్రేమ గురించి ఇంకా చెప్తూ.. "అది ఒక 'అన్‌కండిషనల్ లవ్'. నేను అతని కోసం ఇది చేస్తున్నానని ఆ హీరోకి తెలియకపోయినా, నేను ఉన్నానన్న విషయం అతనికి తెలియకపోయినా.. ఫ్యాన్ ఆ హీరో కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఇంతకంటే గొప్ప ప్రేమ ఈ ప్రపంచంలో ఏముంటుంది? ఇంత బ్యూటిఫుల్ ఎమోషన్‌ను ఇప్పటిదాకా ఎందుకు ఎవరూ ఎక్స్‌ప్లోర్ చేయలేదా అని నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఈ కథ వినగానే, ఇదే మనం చెప్పాలనుకుంది అని వెంటనే కనెక్ట్ అయ్యాను" అని రామ్ ముగించాడు.

Tags:    

Similar News