కొత్త ఫార్ములాని ఫాలో అవుతున్న‌ ఉస్తాద్ రామ్‌!

ఇస్మార్ట్ శంక‌ర్ బ్టాక్ బ‌స్ట‌ర్ త‌రువాత రామ్ ఆ స్థాయి స‌క్సెస్‌ని సొతం చేసుకోలేక‌పోతున్నాడు.;

Update: 2025-06-18 10:30 GMT

ఇస్మార్ట్ శంక‌ర్ బ్టాక్ బ‌స్ట‌ర్ త‌రువాత రామ్ ఆ స్థాయి స‌క్సెస్‌ని సొతం చేసుకోలేక‌పోతున్నాడు. లింగుస్వామితో చేసిన 'ది వారియ‌ర్‌', బోయ‌పాటి శ్రీ‌నుతో చేసిన 'స్కంద‌', పూరిజ‌గ‌న్నాథ్‌తో చేసిన 'డ‌బుల్ ఇస్మార్ట్' వ‌రుస‌గా ఫ్లాప్ కావ‌డంతో కొంత ఆలోచ‌న‌లో ప‌డిన రామ్ త‌న పంథా మార్చుకున్నాడు. ఇస్మార్ట్ శంక‌ర్ మూవీ నుంచి యాక్ష‌న్ బాట‌ప‌ట్టిన రామ్ అది వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డం, వ‌రుస ఫ్లాపులు ఎదుర‌వుతుండ‌టంతో ఫైన‌ల్‌గా త‌న రూటు మార్చుకున్నాడు.

యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌ల‌తో చేతుల కాల్చుకున్న రామ్ వెంట‌నే తేరుకుని త‌నదైన మార్కు రొమాంటిక్ ల‌వ్ స్టోరీల‌నే చేయాలి, అందులోనూ సెన్సిబుల్ మూవీస్ మాత్ర‌మే చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడ‌ట‌. ఈ మార్పులో భాగంగానే ప్ర‌స్తుతం 'ఆంధ్రా కింగ్ తాలూకా' మూవీని చేస్తున్న‌ట్టుగా తెలిసింది. ఇందులో క‌న్న‌డ హీరో ఉపేంద్ర సూప‌ర్ స్టార్‌గా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

ఇటీవ‌లే ఫ‌స్ట్‌లుక్‌తో పాటు టీమ్ గ్లింప్స్‌ని కూడా రిలీజ్ చేసి సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. మాస్ ఎలిమెంట్స్‌తో సాగే ఎమోష‌న‌ల్ ల‌వ్ డ్రామాగా దీన్ని తెర‌కెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి రామ్ కొత్త ఫార్ములాని ఫాలో అవుతున్న‌ట్టుగా తెలుస్తోంది. డ‌బుల్ ఇస్మార్ట్ మూవీ వ‌ర‌కు రూ.25 నుంచి రూ.30 కోట్ల వ‌ర‌కు పారితోషికాన్ని డిమాండ్ చేసిన రామ్ 'ఆంధ్రా కింగ్ తాలూకా' కు మాత్రం ఆ స్థాయిలో డిమాండ్ చేయ‌డం లేద‌ట‌.

ఈ సినిమాకు కొత్త ప‌ద్ద‌తిని పాటిస్తున్నాడ‌ట‌. ఈ సినిమాకు రూ.10 కోట్లు మాత్ర‌మే పారితోషికం తీసుకుంటున్న రామ్ మిగ‌తా మొత్తాన్ని సినిమా లాభాల్లో వాటాని తీసుకుంటున్నాడ‌ట‌. ఇదే ఒప్పందాన్ని నిర్మాత‌లు రామ్‌తో చేసుకున్న‌ట్టుగా ఇన్ సైడ్ టాక్‌. ఈ మూవీని మైత్రీమూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే సినిమాల నిర్మాణంలో కొత్త పంథాని పాటిస్తున్న మైత్రీ వారు రామ్‌తో ఈ సినిమా కోసం ప్రాఫిట్ అండ్ షేర్ విధానాన్ని అమ‌ల్లోకి తీసుకొచ్చార‌ట‌. మ‌హేష్ బాబు పి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రామ్‌కు జోడీగా భాగ్య‌శ్రీ బోర్సే న‌టిస్తోంది.

Tags:    

Similar News