రామ్ సినిమా లెక్క తేలేది ఎప్పుడు..?

ఉస్తాద్ రామ్ డబుల్ ఇస్మార్ట్ సినిమా తర్వాత మహేష్ బాబు పి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు.;

Update: 2025-06-06 15:10 GMT

ఉస్తాద్ రామ్ డబుల్ ఇస్మార్ట్ సినిమా తర్వాత మహేష్ బాబు పి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాకు టైటిల్ గా ఆంధ్రా కింగ్ తాలూకా గా ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. లవ్ స్టోరీ కం మాస్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో రామ్ ఎనర్జీ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు.

ఐతే రామ్ ఈ సినిమా తర్వాత ఎవరితో చేస్తాడన్న లెక్క తేలాల్సి ఉంది. అసలైతే రామ్ డైరెక్టర్స్ లిస్ట్ లో స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఉన్నాడు. మిస్టర్ బచ్చన్ తర్వాత హరీష్ శంకర్ మరో సినిమా కమిట్ అవ్వలేదు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మళ్లీ మొదలవుతుంది కానీ అది ఎప్పుడు అన్నది తెలియదు. అందుకే ఈలోగా మరో సినిమా చేయాలనే ప్లానింగ్ లో ఉన్నాడు హరీష్ శంకర్.

రామ్ తో హరీష్ శంకర్ సినిమా ఉంటుందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఐతే రామ్ లాంటి ఎనర్జిటిక్ హీరోకి హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్ కలిస్తే అద్భుతాలు చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈ కాంబో వస్తుందని తెలియగానే ఫ్యాన్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ క్రియేట్ అయ్యింది. రామ్ హరీష్ శంకర్ కాంబో సినిమా కన్ఫర్మ్ అయితే మాత్రం ఆడియన్స్ కి మంచి ఫీస్ట్ లాంటి సినిమా వస్తుందని చెప్పొచ్చు. ఐతే హరీష్ శంకర్ నెక్స్ట్ రామ్ తోనే సినిమా చేస్తాడని అంటున్నా ఆయన బాలయ్యతో కూడా ఒక సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది.

రామ్ సినిమా ముందు చేస్తాడా లేదా బాలకృష్ణతో సినిమా మొదలు పెడతారా అన్నది చూడాలి. రామ్ ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండగా ఏమాత్రం గ్యాప్ లేకుండా మరో సినిమా వెంటనే మొదలు పెడతాడని అంటున్నారు. హరీష్ శంకర్ రామ్ కాంబో సినిమా త్వరగా మొదలవ్వాలని ఆడియన్స్ కోరుతున్నారు. హరీష్ తోనే కాదు రామ్ త్రివిక్రం తో కూడా ఒక సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఆ సినిమా గురించి మాత్రం ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు.

Tags:    

Similar News