సీఎం కారులో సీఎంతోపాటు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ
ఆ కార్యక్రమానికి రామ్ చరణ్, విజయ్ దేవరకొండ హాజరయ్యారు. మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాటంలో ఐక్యంగా పోరాడుతున్న సీఎం రేవంత్ కు మద్దతుగా నిలిచారు.;
తెలంగాణ ముఖ్యమంత్రి కారులో సీఎం రేవంత్ రెడ్డితోపాటు టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ కనిపించారు. ముగ్గురూ కలిసి ఓ ఈవెంట్ కు కూడా హాజరయ్యారు. అందుకు సంబంధించిన పిక్స్ అండ్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజన్లు, సినీ ప్రియులను ఆకట్టుకుని ఫుల్ గా ట్రెండ్ అవుతున్నాయి.
తమ అప్ కమింగ్ మూవీల షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్న రామ్ చరణ్, విజయ్ దేవరకొండ.. సడెన్ గా తెలంగాణ ముఖ్యమంత్రి కారులో సీఎంతోపాటు గురువారం కనిపించడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. నెటిజన్లు, సినీ ప్రియులు, అభిమానులు.. ఏంటి స్పెషల్ అబ్బా అంటూ సోషల్ మీడియాలో తెగ డిస్కస్ చేసుకుంటున్నారు.
అయితే మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం పోరాడుతోంది. అనేక కార్యక్రమాలు చేపడుతోంది. యాంటీ- డ్రగ్ క్యాంపెయిన్ నడిపిస్తోంది. అందులో భాగంగా తెలంగాణ యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో.. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం- అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ కార్యక్రమం నిర్వహించింది.
ఆ కార్యక్రమానికి రామ్ చరణ్, విజయ్ దేవరకొండ హాజరయ్యారు. మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాటంలో ఐక్యంగా పోరాడుతున్న సీఎం రేవంత్ కు మద్దతుగా నిలిచారు. అయితే ఇప్పటికే డ్రగ్స్ వినియోగంపై అనేక మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో అవగాహన కల్పిస్తున్నారు. ఎప్పటికప్పుడు సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.
అయితే సీఎం కారులో చరణ్, విజయ్ ఉన్న వీడియో వైరల్ కాగా.. వారిద్దరి లుక్స్ ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. ఫుల్ గా గడ్డం, లాంగ్ హెయిర్ తో రామ్ చరణ్ కనిపించారు. ఆయన అప్ కమింగ్ మూవీ పెద్దిలో చరణ్ లుక్ అలాగే ఉంటుందని ప్రమోషనల్ కంటెంట్ క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు లుక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ అంటున్నారు.
అదే సమయంలో కింగ్ డమ్ తో మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విజయ్ దేవరకొండ.. షార్ట్ హెయిర్, మీసాలతో కనిపించారు. సినిమాలో ఆయన లుక్ అదే అన్న విషయం తెలిసిందే. స్పై జోనర్ లో రూపొందుతున్న ఆ సినిమా.. మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానుంది. పెద్ది మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఆ రెండు సినిమాలతో ఇద్దరు హీరోలు ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.