విడాకులు, వివాదాలపై తొలిసారి స్పందించిన విజయ్!
ప్రధానంగా ఈ అంశాలపై విజయ్ ఇండైరెక్ట్‌గా స్పందించారు. ఇటీవల నన్ను చుట్టుముట్టిన సమస్యలు, ఇబ్బందుల గురించి మీరు ఆలోచించాల్సిన పని లేదు.;
కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ చుట్టు వివాదాలు అలుముకున్న విషయం తెలిసిందే. పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి విజయ్ ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఆయనపై ముప్పెట దాడి జరుగుతోంది. ఇంటా బయట అయనని సమస్యలు, వివాదాలు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ ఎట్టకేలకు స్పందించారు. తన చుట్టూ అలుముకుంటున్న సమస్యలపై ఇండైరెక్ట్‌గా వ్యాఖ్యలు చేశారు. తనని వెంటాడుతున్న సమస్యల కారణంగా అభిమానులు, ప్రజలు ఇబ్బందిపడుతుంటే బాధగద ఉందన్నారు.
టీవీకే పార్టీ ఆధ్వర్యంలో చెన్నై సమీపంలోని చెంగల్‌పట్టులో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో విజయ్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వ్యక్తిగత వివాదాల గురించి తాను చూసుకుంటానని, ప్రజా సమస్యల గురించి పార్టీ కార్యకర్తలంతా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహిళలకు ప్రత్యేక వరాలు ప్రకటిస్తూ పార్టీ మేనిఫెస్టోనీ ప్రకటించారు. ఇటీవల భార్య సంగీత విడాకుల కోసం కోర్టుని ఆశ్రయించడం, అదే సమయంలో త్రిషతో రిలేషన్ గురించి గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
ప్రధానంగా ఈ అంశాలపై విజయ్ ఇండైరెక్ట్‌గా స్పందించారు. ఇటీవల నన్ను చుట్టుముట్టిన సమస్యలు, ఇబ్బందుల గురించి మీరు ఆలోచించాల్సిన పని లేదు. వాటిపై మీరు పోరాటం చేసి వారిని బాధించాల్సిన అవసరం అంతకన్నా లేదు. అవన్నీ నేను చూసుకుంటాను. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు ఆవేదనగా ఉంది. అవి మీ సమయం కంటే విలువైనవి కావు. ఆ సమస్యలను నేను చూసుకుంటాను. ప్రస్తుతం మీరు చేయాల్సిందల్లా ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే. ప్రస్తుతం మనం ప్రజా సమస్యలపై ఫోకస్ చేద్దాం` అన్నారు.
తన చుట్టూ సమస్యలు చుట్టుముడుతున్నా.. భార్య సైతం తనని ఇబ్బందులుకు గురి చేస్తూ విడాకుల కోసం కోర్టుని ఆశ్రయించినా దళపతి విజయ్‌లో ఎలాంటి టెన్షన్ కనిపించకపోవడం గమనార్హం. జరగనున్నవి ఎలాగూ జరుగుతూనే ఉంటాయని, తనని చుట్టూ సమస్యలతో ఉక్కిరి బిక్కిరి చేస్తారని, వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలని విజయ్ స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తోంది. ప్రత్యర్థులు ఎలాంటి ఇబ్బందుల్ని సృష్టించినా, ఎలాంటి బెదిరింపులకు దిగినా రాజకీయాల నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పుకునే ఉద్దేశ్యం తనకు లేదని ప్రత్యర్థులకు విజయ్ సంకేతాలిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
పార్టీ ప్రకటించి ఇంకా ఎన్నికల్లో పోటీకి దిగనేలేదు. ఎన్నికలు జరగనే లేదు కానీ విజయ్ లాంటి వ్యక్తిని ఎందుకు ఇలా పరిస్థితులు ఆడుకుంటున్నాయన్నది జాతీయ స్థాయిలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బెదిరింపులకు, తన చుట్టూ ఏర్పడే సమస్యలకు బెదిరిపోయి విజయ్ రాజకీయాల నుంచి తప్పుకుంటాడనే ఇలాంటి సమస్యలు ఎదురయ్యేలా చేస్తున్నారా? .. పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండానే ప్రత్యర్థులు విజయ్‌ని హడలెత్తించాలనుకుంటున్నారు? అనే చర్చ సామాన్యుల్లో, అభిమానుల్లో మొదలైంది. తాజాగా విజయ్ స్టేట్‌మెంట్‌తో తను రాజకీయాల్లోకి రావాలని ఎంత స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాడో ఫుల్ క్లారిటీ రావడం తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది.