• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  క్రికెట్ బాడీ లుక్ కోసం...

క్రికెట్ బాడీ లుక్ కోసం చ‌ర‌ణ్ కు బుచ్చి టార్చ‌ర్

| టాలీవుడ్‌లో డైరెక్ట‌ర్ సుకుమార్ స్కూల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

By - Sravani Lakshmi Srungarapu
Update: 2026-05-21 10:36 GMT

టాలీవుడ్‌లో డైరెక్ట‌ర్ సుకుమార్ స్కూల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన దగ్గర పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు, రైటర్లు తర్వాత డైరెక్ట‌ర్లుగా మారి తమదైన గుర్తింపు తెచ్చుకోవడం ఇండస్ట్రీలో ఇప్పటికే పెద్ద చర్చగా మారింది. అలాంటి సుకుమార్ బ్యాచ్ పని తీరు గురించి స్టార్ హీరో రామ్ చరణ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా పెద్ది ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజైన ఓ ఫన్ చిట్‌చాట్ వీడియోలో ఈ ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. పెద్ది సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేస్తున్నారు. అందులో భాగంగా కారులో ప్రయాణిస్తూ రామ్ చరణ్, బుచ్చిబాబు చేసిన సరదా సంభాషణ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఈ వీడియోలో పెద్ది కోసం తనపై పెట్టిన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రెజర్ గురించి రామ్ చరణ్ సరదాగా మాట్లాడారు. సినిమాలో ఆటకూలీ పాత్రలో కనిపించనున్న చరణ్, కథలో భాగంగా పలు క్రీడల్లో పాల్గొనే వ్యక్తిగా నటిస్తున్న సంగ‌తి తెలిసిందే. దాంతో ఒక్కో గేమ్‌కు ఒక్కో రకమైన బాడీ లుక్ కావాలని బుచ్చిబాబు అడిగేవాడని చరణ్ చెప్పారు. క్రికెటర్‌లా ఉండాలి అంటావ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా లాంటి ఫిట్ లుక్ కావాలి అంటావ్. వెంట‌నే కుస్తీకి మరో లుక్, రెజ్లింగ్‌కు ఇంకో లుక్ అంటే ఒకేసారి అన్నీ ఎలా వస్తాయంటూ చరణ్ నవ్వుతూ అడిగిన తీరు వీడియోలో హైలైట్‌గా మారింది. దానికి స్పందించిన బుచ్చిబాబు, కొన్నిసార్లు ఫలానా లుక్ కావాలని అడగడానికే భయమేసేది సార్ అని చెప్పడంతో చ‌ర‌ణ్ న‌వ్వేశారు.

త‌ర్వాత మీ సుకుమార్ గారి బ్యాచ్ అందరికీ దండం పెట్టాలంటూ రామ్ చరణ్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సుకుమార్ శిష్యుల పని తీరు ఎంత డీటైల్‌గా ఉంటుందో, పాత్రల విషయంలో ఎంత కఠినంగా ఆలోచిస్తారో చరణ్ సరదాగా చెప్పినా, అందులో డైరెక్ట‌ర్ల కమిట్‌మెంట్‌పై ఉన్న గౌరవం స్పష్టంగా కనిపించింది. దానికి వెంట‌నే బుచ్చిబాబు, సార్… మేం మా గురువు గారి అంత కాదు అని వినయంగా స్పందించగా, వెంటనే మీ గురువు గారే బెటర్ అంటూ చరణ్ మరోసారి ఫన్నీగా కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది.



Ram Charan : Delhi Episode is My Favourite Episode in Entire #Peddi Movie.

నువ్వు ఇది అసలు ఎలా రాసావో అర్ధం కాలేదు...ఉప్పెన లో నువ్వు రాసిన ఆ పాయింట్ కన్నా #Peddi లో నువ్వు రాసిన ఈ ఎపిసోడ్ 100 రెట్లు ఎక్కువ.#PEDDI in cinemas worldwide on 4th June. 💥#Peddi #RamCharan… pic.twitter.com/htOkjb7QqO

— Tupaki (@tupaki_official) May 21, 2026


Tags:    
  • ramcharan 
  • sukumar 
  • peddi 
  • buchibabu 
  • tollywood 
  • telugucinema 
  • rc16 

Similar News

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

Copyright @2026

Powered by Blink CMS