'పెద్ది' ఎఫెక్ట్‌... మారు మ్రోగుతున్న నబకాంత పేరు

ఎంతటి మొనగాడైనా బాల్‌ను అలా పిచ్‌ మధ్యలోకి వెళ్లి మరీ కొట్టగలడా అంటూ మీమ్స్ తెగ వైరల్‌ అయ్యాయి. అదే సమయంలో చరణ్ పాత్ర గురించి ప్రముఖంగా చర్చ జరిగింది.;

Update: 2025-04-22 05:45 GMT
Nabakanta For Peddi

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న 'పెద్ది' చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. శ్రీరామ నవమి సందర్భంగా సినిమా నుంచి ఫస్ట్‌ షాట్‌ పేరుతో రామ్‌ చరణ్ గ్లిమ్స్‌ను విడుదల చేశారు. ఆ వీడియోలో రామ్‌ చరణ్‌ క్రికెట్‌ బ్యాట్‌ పట్టి కనిపించిన విషయం తెల్సిందే. ఆ వీడియోలో రామ్‌ చరణ్ కొట్టిన షాట్‌ వైరల్‌ అవుతోంది. ప్రొఫెషనల్‌, ఇంటర్నేషనల్‌ స్టార్‌ క్రికెటర్స్ సైతం అలాంటి షాట్‌ ఆడలేరు అంటూ కొందరు కామెంట్‌ చేస్తే, సినిమాలోని పెద్ది పాత్ర పవర్‌ ను చూపించడానికి, అతడి పాత్రను గురించి తెలియజేయడానికి ఆ షాట్ బాగా ఉపయోగపడిందనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం ఆ షాట్‌ను ట్రోల్‌ చేస్తున్నారు.

ఎంతటి మొనగాడైనా బాల్‌ను అలా పిచ్‌ మధ్యలోకి వెళ్లి మరీ కొట్టగలడా అంటూ మీమ్స్ తెగ వైరల్‌ అయ్యాయి. అదే సమయంలో చరణ్ పాత్ర గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. మొత్తానికి సినిమాకు పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ చేయడంలో ఆ షాట్‌ కీలకంగా ఉపయోగపడింది అనడంలో సందేహం లేదు. తాజాగా దర్శకుడు బుచ్చిబాబు ఒక ఇంటర్వ్యూలో ఆ షాట్‌ గురించి, ఆ సమయంలో తాను ఎదుర్కొన్న సంఘర్షణ గురించి చెప్పుకొచ్చారు. గ్లిమ్స్ రెడీ చేసిన సమయంలో చిరంజీవి గారికి చూపించేందుకు వెళ్లాం. ఆ షాట్‌ కి ఆయన ఎలా స్పందిస్తారా అని చాలా టెన్షన్ పడ్డాము. కానీ ఆయన చాలా బాగుందని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాము. ఆయన నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో మరింత నమ్మకం కుదిరిందన్ని అన్నాడు.

ఆ షాట్‌ ఐడియా ప్రముఖ స్టంట్స్ మాస్టర్‌ మైబం నబకాంత మెయిటే ది అని బుచ్చిబాబు చెప్పుకొచ్చాడు. ఇతడు పుష్ప 2 సినిమాలోని కీలకమైన గంగమ్మ జాతరకు సంబంధించిన యాక్షన్‌ సన్నివేశాలను కంపోజ్‌ చేయడం జరిగింది. ఆ ఫైట్‌ సీన్‌కి ఏ స్థాయిలో రెస్పాన్స్ దక్కిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ షాట్‌కి సైతం అదే స్థాయిలో రెస్పాన్స్ దక్కడంతో సినిమాలోని మరిన్ని యాక్షన్‌ సన్నివేశాలకు, ఇలాంటి స్పోర్ట్స్ కమ్‌ యాక్షన్‌ సీన్స్‌కు నబకాంత కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. రామ్‌ చరణ్‌ మెచ్చిన ఈ షాట్‌ను అందించినందుకు గాను నబకాంతకు ముందు ముందు టాలీవుడ్‌లో మరిన్ని సినిమాలకు వర్క్ చేసే అవకాశాలు రావచ్చు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో నబకాంత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బుచ్చిబాబు ఆ షాట్‌ను నబకాంత కంపోజ్‌ చేశాడని చెప్పడంతో మరింతగా అతడి గురించి ఇంటర్నెట్‌లో వెతుకుతున్నారు. అతడు మణిపూర్‌కి చెందిన ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్‌. పుష్ప 2 కోసం అతడు చేసిన విభిన్నమైన యాక్షన్‌ కొరియోగ్రఫీ కారణంగా ఇండస్ట్రీలో మంచి పేరు దక్కించుకున్నాడు. పెద్ది సినిమాతో ప్రేక్షకులకు మరింత ఇతడు చేరువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పెద్ది సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుని, యాక్షన్‌ సీన్స్‌కి మంచి పేరు వస్తే టాలీవుడ్‌లో ఇతడు మోస్ట్‌ బిజీ స్టంట్స్ మాస్టర్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News