పెద్ది ప్లానింగ్.. అబ్బో నెక్స్ట్ లెవెల్..!

గ్లోబల్ స్టార్ రాం చరణ్ పెద్ది మూవీ సెట్స్ మీద ఉంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.;

Update: 2025-08-27 13:30 GMT

గ్లోబల్ స్టార్ రాం చరణ్ పెద్ది మూవీ సెట్స్ మీద ఉంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి అకాడమీ విన్నర్ ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. పెద్ది సినిమా ఫస్ట్ షాట్ తోనే బుచ్చి బాబు తన మార్క్ చూపించాడు. ఫస్ట్ షాట్ రేంజ్ సినిమా ఉంటే మాత్రం చరణ్ కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ రాసుకోవచ్చు. ఉప్పెనతో హిట్ అందుకున్న బుచ్చి బాబు నెక్స్ట్ సినిమానే చరణ్ తో చేయడం సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉంది. పెద్ది లో రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ కూడా ఒక రేంజ్ లో ఉండబోతుందని అంటున్నారు.

రెండు డిఫరెంట్ వేరియేషన్స్ ..

రామ్ చరణ్ పెద్ది సినిమాలో రెండు డిఫరెంట్ వేరియేషన్స్ లో కనిపిస్తారట. ఒక లుక్ ఆల్రెడీ టీజర్ లో చూసేశాం. మరో లుక్ ఒకటి బయటకు రావాల్సి ఉంది. ఐతే ప్రెజెంట్ చరణ్ వేరే లుక్ తో షూటింగ్ లో పాల్గొంటున్నారట. మైసూర్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ షెడ్యూల్ లో చరణ్ కొత్త లుక్ తోనే వచ్చారట. చిత్ర యూనిట్ సైతం చరణ్ మేకోవర్ సర్ ప్రైజ్ చేసిందని అంటున్నారు.

సో చరణ్ పెద్ది లో లుక్స్ తోనే సంథింగ్ క్యూరియస్ అనిపించేలా ఉన్నాడని చెప్పొచ్చు. ఈ సినిమా కథ క్రికెట్ తో పాటు విలేజ్ పాలిటిక్స్ కి సంబందించినదని తెలుస్తుంది. చరణ్ మరోసారి తన మాస్ స్టామినా చూపించేలా ఇది ఉంటుందట. చరణ్ గేం ఛేంజర్ ఈ ఇయర్ మొదట్లో వచ్చి డిజాస్టర్ అయ్యింది. ఐతే ఆ సినిమా ఇచ్చిన షాక్ కి మెగా ఫ్యాన్స్ అంతా కూడా చాలా అప్సెట్ లో ఉన్నారు. అందుకే ఈసారి పెద్దితో డబుల్ ధమాకా ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు రామ్ చరణ్.

ఫ్యాన్స్ కి మంచి ఫీస్ట్..

పెద్ది నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ కి మంచి ఫీస్ట్ అందిస్తుంది. ఫస్ట్ షాట్ నుంచి పెద్ది మెగా ఫ్యాన్స్ కి మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ కి నచ్చేసింది. సినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. అసలైతే ఈ రోల్ కి విజయ్ సేతుపతిని తీసుకోవాలని అనుకుంటే అతను నో చెప్పాడని శివరాజ్ కుమార్ ని ఫైనల్ చేశారు.

Tags:    

Similar News