బుచ్చి ప్లానింగే ప్లానింగు!
ఆచార్య, గేమ్ ఛేంజర్ సినిమాలతో వరుస ఫ్లాపులు అందుకున్న రామ్ చరణ్ నెక్ట్స్ మూవీతో ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని నిర్ణయించుకుని పెద్ది సినిమాను చేస్తున్నారు.;
ఆచార్య, గేమ్ ఛేంజర్ సినిమాలతో వరుస ఫ్లాపులు అందుకున్న రామ్ చరణ్ నెక్ట్స్ మూవీతో ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని నిర్ణయించుకుని పెద్ది సినిమాను చేస్తున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
రిలీజ్ డేట్ టార్గెట్ కోసం పరుగులు
విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది మార్చి 27కు రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రీసెంట్ గా మైసూర్ షెడ్యూల్ లో ఇంట్రడక్షన్ సాంగ్ ను తెరకెక్కించిన చిత్ర యూనిట్ ఇప్పుడు కొత్త షెడ్యూల్ కోసం హైదరాబాద్ కు వచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ను మేకర్స్ అందించారు.
50% షూటింగ్ పూర్తి చేసుకున్న పెద్ది
పెద్ది సినిమా షూటింగ్ తో పాటూ ఎడిటింగ్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతుందని, ఇప్పటికే ఈ సినిమా 50% షూటింగ్ ను పూర్తి చేసుకుందని చిత్ర యూనిట్ తెలిపింది. దాంతో పాటూ డైరెక్టర్ బుచ్చిబాబు, డీఓపీ రత్నవేలు, ఎడిటర్ నవీన్ నూలి కలిసి దిగిన ఓ ఫోటోను షేర్ చేశారు. పెద్ది సినిమాకు నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతల్ని తీసుకోగా, రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు.
పెద్ది షూటింగ్ రీసెంట్ గానే మొదలుపెట్టినప్పటికీ, బుచ్చిబాబు ముందు నుంచి ఈ సినిమా కోసం అన్నీ సరిగ్గా ప్లాన్ చేసుకోవడంతో షూటింగ్ చకచకా పూర్తవుతూ వస్తుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తుండగా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి.