చరణ్ 'పెద్ది'.. ఈ బజ్ సరిపోతుందా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా మీద రోజురోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.;

Update: 2026-05-01 08:17 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా మీద రోజురోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న ఆ చిత్రంపై మొదటి నుంచే ఓ రేంజ్ లో హోప్స్ ఉన్నాయి. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ సినిమాలో ఫిమేల్ లీడ్ రోల్ లో నటిస్తుండటం కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, రెండు పాటలు ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేశాయి.

అయితే ఆ హైప్ మధ్యలో సినిమా విడుదల వాయిదాలు అభిమానులను కొంత నిరాశకు గురి చేశాయి. పలుమార్లు రిలీజ్ డేట్స్ మారడంతో పెద్ది ఎప్పుడు వస్తుందో అన్న సందేహం నెలకొంది. ఇటీవల ఓ ఈవెంట్‌ లో దర్శకుడు జూన్ 25న సినిమా విడుదల అవుతుందని ప్రకటించడంతో ఫ్యాన్స్ కొంత ఊరట పొందారు. అయినప్పటికీ, అధికారికంగా కంప్లీట్ ప్రమోషన్స్ ప్రారంభం కాకపోవడం గమనించాల్సిన విషయం.

సాధారణంగా రామ్ చరణ్ వంటి స్టార్ హీరో సినిమా అంటే భారీ ప్రమోషన్ క్యాంపెయిన్స్ ఉంటాయి. కానీ పెద్ది విషయంలో మాత్రం మేకర్స్ ఇప్పటివరకు చాలా మినిమమ్‌ గా వ్యవహరించారు. షూటింగ్ సెట్స్ నుండి కొన్ని వర్కింగ్ స్టిల్స్ విడుదల చేయడం తప్ప పెద్దగా అప్డేట్స్ ఇవ్వలేదు. దీంతో మెగా అభిమానులు సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం రెగ్యులర్ అప్డేట్స్ అయినా ఇవ్వాలని కోరుతున్నారు.

అదే సమయంలో మేకర్స్ నిశ్శబ్దంగా ఉండటం మరోవైపు ఆసక్తి కూడా పెంచుతోంది. సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ కారణంగా ఇలా వ్యవహరిస్తున్నారేమో అన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. పెద్ద స్థాయి సినిమాలకు కొన్ని సందర్భాల్లో ఎక్కువ ప్రమోషన్స్ అవసరం లేకపోవచ్చు. కానీ ప్రస్తుత కాలంలో డిజిటల్ హడావుడి ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం కూడా చాలా ముఖ్యమైంది.

ఈ నేపథ్యంలో నేడు హైదరాబాద్‌ లో మధ్యాహ్నం 2 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనుండటం కీలకంగా మారింది. ప్రెస్ మీట్ ద్వారా సినిమా గురించి క్లారిటీ ఇవ్వడంతో పాటు, రాబోయే ప్రమోషన్స్ ప్లాన్‌ ను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా ట్రైలర్ రిలీజ్, మిగతా పాటల విడుదల వంటి అంశాలపై అప్డేట్స్ వచ్చే అవకాశం ఉందని సమాచారం.

అయితే ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాకు కావాల్సిన బజ్‌ ను తీసుకొచ్చాయి అనడంలో సందేహం లేదు. అయితే అది సరిపోతుందా అన్న ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం, సినిమా రిలీజ్‌ కు ముందు బజ్ ఎంత ఎక్కువగా ఉంటే, అడ్వాన్స్ బుకింగ్స్ అంత భారీగా ఉంటాయి. అదే ఓపెనింగ్స్‌పై నేరుగా ప్రభావం చూపుతుంది.

కాబట్టి పెద్ది విషయంలో కూడా మేకర్స్ ఇకపై మరింత గట్టిగా ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ట్రైలర్‌ తో పాటు స్ట్రాంగ్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంటే, సినిమా బజ్ మరో స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. ఫ్యాన్స్ కూడా అదే ఆశిస్తున్నారు. ఏదేమైనా పెద్దికి ఇప్పటికే మంచి బేస్ బజ్ ఉన్నా, దాన్ని నెక్స్ట్ లెవెల్‌ కు తీసుకెళ్లే బాధ్యత ఇప్పుడు మేకర్స్‌పై ఉంది. రాబోయే రోజుల్లో ఇచ్చే అప్డేట్స్, ప్రమోషన్స్‌ ద్వారానే ఆ సినిమా ఓపెనింగ్స్ ఎంతటి రేంజ్ లో ఉంటాయో డిసైడ్ అవుతుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో..

Tags:    

Similar News